SCR: ప్రయాణీకులపై మరో పిడుగు.. ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు భారీగా పెంపు.. అప్పటి వరకు బాదుడే బాదుడు..

రైల్వే ప్రయాణీకులపై దక్షిణ మధ్య రైల్వే బాదుడు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లలో ఛార్జీల పెంపుతో ఆర్థికంగా కుదేలవుతున్న ప్రయాణీకులపై ప్లాట్ ఫామ్ టికెట్ రూపంలో అదనపు ఛార్జీలు మోపింది...

SCR: ప్రయాణీకులపై మరో పిడుగు.. ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు భారీగా పెంపు.. అప్పటి వరకు బాదుడే బాదుడు..
Train
Follow us

|

Updated on: Sep 27, 2022 | 3:31 PM

రైల్వే ప్రయాణీకులపై దక్షిణ మధ్య రైల్వే బాదుడు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లలో ఛార్జీల పెంపుతో ఆర్థికంగా కుదేలవుతున్న ప్రయాణీకులపై ప్లాట్ ఫామ్ టికెట్ రూపంలో అదనపు ఛార్జీలు మోపింది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ.20 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో రూ.10 ఉన్న ధరను రూ.20 కు పెంచారు. అయితే.. దసరా పండుగ రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీని నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలోని కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలు అక్టోబర్ 9 వరకు అమలులోకి ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కలిగించింది. ప్రతి ఏటా ప్రత్యేక బస్సుల్లో పెంచే ఛార్జీలను ఈ ఏడాది పెంచడం లేదని వేల్లడించింది. ప్రయాణీకులు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఉపయోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

మరోవైపు.. దసరా పండగ రద్దీ సందర్భంగా పలు రూట్లలో ప్రత్యేక రైలు సర్వీసులను నడిపిస్తున్నారు. సికింద్రాబాద్‌ – యశ్వంత్‌పూర్‌ (07265), యశ్వంత్‌పూర్‌ – సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07266), తిరుపతి – సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07481), సికింద్రాబాద్‌ – తిరుపతి స్పెషల్‌ (07482) సికింద్రాబాద్‌ నుంచి అక్టోబరు 10వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు 5.20 గంటలకు తిరుపతి చేరుతుంది. తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో రైళ్లలో రద్దీ పెరుగుతోంది. వివిధ పనుల కోసం బాట పడుతోంది. ప్రయాణికులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికు రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు.

సికింద్రాబాద్‌- యశ్వంత్‌పూర్‌ – సికింద్రాబాద్‌ రైలు కాచిగూడ, ఉమాద్‌నగర్‌, షాద్‌ నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, గద్వాల్‌, కర్నూల్‌ సిటీ, ధోన్‌, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్‌, ఎలకం స్టేషన్‌లలో ఆగుతుంది., తిరుపతి – సికింద్రాబాద్‌ – తిరుపతి రైలు రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్‌, మంత్రాలయం, రాయ్‌చూర్‌, తాండూర్‌, వికారాబాద్‌, లింగంపల్లి, బేగంపేట్‌ స్టేషన్స్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..