Health: ఆ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా నెయ్యి తినవద్దు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
భారతీయ వంటల్లో నెయ్యి (Ghee) చాలా ఫేమస్. మిఠాయిలు, తీపి పదార్థాల్లో నెయ్యి వాడకం తప్పనిసరి. ఉత్తరాదిన చపాతీపై నెయ్యి రాసుకుని లాగించేస్తే.. దక్షిణాదిన ముద్దపప్పులో నెయ్యి వేసుకుని ఓ పట్టు పట్టేస్తారు...
భారతీయ వంటల్లో నెయ్యి చాలా ఫేమస్. మిఠాయిలు, తీపి పదార్థాల్లో నెయ్యి వాడకం తప్పనిసరి. ఉత్తరాదిన చపాతీపై నెయ్యి రాసుకుని లాగించేస్తే.. దక్షిణాదిన ముద్దపప్పులో నెయ్యి వేసుకుని ఓ పట్టు పట్టేస్తారు. నెయ్యి లేని ఇండియన్ ఫుడ్స్ ను ఊహించుకోవడం చాలా కష్టం. ఇంత ప్రాధాన్యత కలిగిన నెయ్యి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అతి ఏదైనా వ్యర్థమే అన్నట్లు ఎక్కువగా నెయ్యిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశీ నెయ్యి స్వచ్ఛమైనది. సహజంగా తయారవుతుంది. చపాతీలు, దాల్, పరోటా వంటి వంటకాలకు అదనపు రుచిని అందిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ సమస్యలు, స్థూలకాయం, పీసీఓడీ వంటి సమస్యలతో సతమతమవుతున్నవారు, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు నెయ్యి తినడం మంచిది కాదు. నెయ్యిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో దాదాపు 112 కేలరీలు ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం 2000 కేలరీల ఆహారం ఉన్న ఏ ఆరోగ్యకరమైన వ్యక్తికైనా.. సంతృప్త కొవ్వు రోజుకు 16 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. దీంతో అధికమొత్తంలో నెయ్యి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
గుండె జబ్బులు లేదా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు ఆవు నెయ్యిని ఎక్కువగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారు నెయ్యి వినియోగాన్ని నివారించాలి. నెయ్యి కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. అది రక్తపోటును పెంచుతుంది. రోజూ భోజనంలో భాగంగా తీసుకోగల నెయ్యి గురించి ఎల్లప్పుడూ మీ డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి. అయితే కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది.
మరోవైపు.. నెయ్యిని తగినంత మోతాదులో ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ పెరుగుతుంది. ఆవు నెయ్యిలో విటమిన్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ, డీ, ఈ, కే, వంటి విటమిన్స్ లభిస్తాయి.శరీరంలో క్యాన్సర్ సెల్స్ వృద్ధిని ఆవునెయ్యి అరికడుతుందట. రెగ్యులర్ గా తక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఒక టీ స్పూన్ నెయ్యిని రోటీపై రాసుకుని తీసుకుంటే ఆకలిని అదుపులో ఉంచడమే కాకుండా ఇమ్యునిటీని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, లినోలిక్ యాసిడ్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెరగడమే కాకుండా.. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి