CM YS Jagan: తిరుపతి బ్రహ్మోత్సవాలకు ఒలెక్ట్రా బస్సులు.. లాంఛనంగా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..

ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలిపిరి డిపోలో జెండా ఊపి బుధవారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ బస్సులతో పర్యావరణానికి మేలు జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.

CM YS Jagan: తిరుపతి బ్రహ్మోత్సవాలకు ఒలెక్ట్రా బస్సులు.. లాంఛనంగా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 27, 2022 | 10:51 PM

తిరుమల శేషాచలం కొండల్లో వాయు కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు ఏపీ సర్కార్‌ ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల ఘాట్‌రోడ్డులో గత వారం రోజులుగా ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తూ అధికారులు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి అలిపిరి డిపోలో జెండా ఊపి బుధవారం రాత్రి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి రీజియన్‌కు వంద ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్డర్‌ పెట్టగా..వాటిలో 50 బస్సులను డిసెంబర్‌ నాటికి తిరుమల ఘాట్‌రోడ్డులో నడపాలని నిర్ణయించారు. మిగతా 50 బస్సులను ఇతర ప్రాంతాలకు కేటాయించారు. ఛార్జింగ్‌ కోసం అలిపిరి డిపో దగ్గర పాయింట్లను ఏర్పాటు చేశారు. ఏబీఎస్‌, పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ సిస్టమ్‌తో నడిచే అత్యంత అధునాతన డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఎలక్ట్రిక్‌ బస్సును తయారు చేశారు. బస్సులో షార్ట్ సర్క్యూట్, మెరుపు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 35 సీట్ల కెపాసిటీ ఉన్న ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ బస్సులో తిరుమల-తిరుపతి ప్రయాణానికి రానుపోను టిక్కెటు ధర 210 రూపాయలుగా గుర్తించారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రగామి అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓలెక్ట్రా) తయారు చేసింది. వంద బస్సుల్లో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి)కు 10 అత్యాధునిక విద్యుత్‌ బస్సులను డెలివరీ చేసింది. ఈ 100 ఈ-బస్సులు 12 సంవత్సరాల పాటు స్థూల కాస్ట్ కాంట్రాక్ట్ (GCC)/OPEX మోడల్ ప్రాతిపదికన సరఫరా చేయడంతో పాటు నిర్వహిస్తాయి. మిగిలిన 90 విద్యుత్‌ బస్సులను అతి త్వరలో ఒలెక్ట్రా డెలివరీ చేయనుంది. ఈ బస్సులను అలిపిరి (తిరుపతి)లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ బస్సుల డిపో నుంచి రాకపోకలు నిర్వహిస్తారు. 50 బస్సులు తిరుమల-తిరుపతి ఘాట్‌లో నడపనుండగా, మిగిలిన 50 బస్సులు నెల్లూరు, కడప, మదనపల్లెలకు ఇంటర్‌సిటీ బస్సులుగా నడుస్తాయి. కాంట్రాక్టు కాలంలో ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ బస్సుల నిర్వహణను కూడా చేపడుతుంది.

ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ “బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు సేవ చేయడం తమకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నామన్నారు. తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో తమ అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. శేషాచల అడవులతో పాటు తిరుమల కొండల పర్యావరణాన్ని ఈ బస్సులు కాపాడతాయని తెలిపారు. సమర్థవంతమైన ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ద్వారా కాలుష్య స్థాయిలను తగ్గించే ప్రయత్నాలకు ఒలెక్ట్రా కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. తమ 100 విద్యుత్‌ బస్సులు మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవంతమవుతాయని భావిస్తున్నామన్నారు. తమ విద్యుత్‌ బస్సులు ముంబై, పూణే, నాగ్‌పూర్, హైదరాబాద్, సూరత్, డెహ్రాడూన్, సిల్వాసా, గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళలో విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.

ఆధునిక సౌకర్యాలతో ఎలక్ట్రిక్ బస్సులు..

ఈ 9మీటర్ల ఎయిర్ కండిషన్డ్ బస్సులు 35+ డ్రైవర్‌ సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్లు, ఎమర్జెన్సీ బటన్‌లు ఉంటాయి. బస్సులో అమర్చబడిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ట్రాఫిక్, ప్రయాణీకుల లోడ్ పరిస్థితుల ఆధారంగా ఒకే ఛార్జ్‌తో 180 కి.మీ.లు బస్సు ప్రయాణిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన ఈ విద్యుత్‌ బస్సులో పునరుత్పాదక బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. హై పవర్ AC & DC ఛార్జింగ్ సిస్టమ్ బ్యాటరీని 3-4 గంటల్లో పూర్తిగా రీఛార్జ్ చేయడానికి వీలవుతుంది.

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే భారతీయ రహదారులపై ఏడు కోట్ల కిలోమీటర్లకు పైగా నడిచాయి. సుమారు 46,000 టన్నుల CO2(కర్భన) ఉద్గారాలను తగ్గించాయి. ఈ ఉద్గారాలను తగ్గించాలంటే రెండు కోట్ల చెట్లు అవసరం. వివిధ రాష్ట్రాలకు 850 పైగా విద్యుత్ బస్సులను ఒలెక్ట్రా డెలివరీ చేసింది. ఒలెక్ట్రా బస్సులు ఎత్తైన హిమాలయ కొండల్లో, మనాలి నుండి రోహ్‌తంగ్ పాస్‌లో ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..