Sai Baba: షిర్డీ సాయి సాధువు మాత్రమే..దేవుడు కాదంటూ స్వయం ప్రకటిత దైవం కృష్ణ శాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ.. సాయిబాబాను సాధువని లేదా ఫకీర్ అని పిలవవచ్చు.. అంతేకాని సాయిని దైవం అని పిలవలేమని అన్నారు.

తిరుమల తిరుపతి తర్వాత ఆ రేంజ్ లో భక్తులు దర్శించుకునే క్షేత్రంలో ఒకటి షిర్డీ.. ఇక్కడ కొలువైన దైవం సాయిబాబాకు దేశవ్యాప్తంగా భక్తులున్నారు. తాజాగా షిర్డీ సాయిబాబా పై బాగేశ్వర్ ధామ్ చీఫ్ కృష్ణ శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ పాటిల్ స్పందించారు. అంతేకాదు సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాగేశ్వర్ ధామ్ చీఫ్ కృష్ణ శాస్త్రి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాజంలోని అన్ని వర్గాలవారు గౌరవించి పూజించే 20వ శతాబ్దపు సాధువు సాయిబాబా అంటూ స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేసి.. వివాదానికి తెర లేపారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ.. సాయిబాబాను సాధువని లేదా ఫకీర్ అని పిలవవచ్చు.. అంతేకాని సాయిని దైవం అని పిలవలేమని అన్నారు.
జగద్గురు ఆది శంకరాచార్య సాయిబాబాకు దేవతా స్థానమును ఇవ్వలేదు. శంకరాచార్యను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి కర్తవ్యం.. ఎందుకంటే శంకరాచార్య హిందూ ధర్మానికి ప్రతినిధి. మన హిందూ ధర్మంలోని ఏ సాధువు అయినా.. అది గోస్వామి తులసీదాస్, సూరదాస్ ఇలా ఎవరైనా సరే ఒక సాధువు, గొప్ప వ్యక్తి, ‘యుగ పురుషుడు’, ‘కల్ప పురుషుడు’ అంతేకాని.. దైవం కాదని ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చెప్పారు. “ప్రజలకు సాయిబాబా మీద విశ్వాసం ఉంది. మనం ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయలేం. సాయిబాబా సాధువు కావచ్చు, ఫకీరు కావచ్చు కానీ దేవుడు కాలేడు” అన్నారాయన.




అయితే ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి , సీనియర్ బిజెపి నాయకుడు రాధాకృష్ణ విఖే పాటిల్ స్పందించారు. కృష్ణ శాస్త్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణ శాస్త్రి బాధ్యతారహిత ప్రకటన చేశారని.. అతనిపై క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలి” అని రాధాకృష్ణ చెప్పారు. ఈ స్వయంప్రతిపత్తి కలిగిన దేవుడే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
బాగేశ్వర్ ధామ్ సర్కార్ అని పిలవబడే ధీరేంద్ర శాస్త్రి.. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి. రాష్ట్రంలో మాత్రమే కాదు.. దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..