AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడి తాగుడు తగలయ్య..12 మందిని పెళ్లి చేసుకుని.. చివరి భార్యను చంపేశాడు

జార్ఖండ్ లో దారుణ ఘటన జరిగింది. 12 మందిని పెళ్లి చేసుకున్న ఓ తాగుబోతు తన చివరి భార్యను కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళ్తే గిరిదిహ్ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో రామచంద్ర తురి అనే వ్యక్తి పెళ్లికి ముందే విపరీతంగా తాగేవాడు.

వీడి తాగుడు తగలయ్య..12 మందిని పెళ్లి చేసుకుని.. చివరి భార్యను చంపేశాడు
Death
Aravind B
|

Updated on: Apr 04, 2023 | 3:02 PM

Share

జార్ఖండ్ లో దారుణ ఘటన జరిగింది. 12 మందిని పెళ్లి చేసుకున్న ఓ తాగుబోతు తన చివరి భార్యను కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళ్తే గిరిదిహ్ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో రామచంద్ర తురి అనే వ్యక్తి పెళ్లికి ముందే విపరీతంగా తాగేవాడు. అతనికి పెళ్లి చేస్తే మారుతాడని భావించిన తల్లిదండ్రులు ఒక సంబంధం కుదిర్చి వివాహం చేశారు. కానీ రామచంద్ర నిత్యం తాగొచ్చి ఆమెను వేధించేవాడు. టార్చర్ తట్టుకోలేని ఆ మొదటి భార్య అతడ్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత రామచంద్ర మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె కూడా అతని వేధింపులు భరించలేక వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కూడా సేమ్ ఆమె వదిలేసి వెళ్లిపోయింది. ఇలా ఒకరి తర్వాత ఒకరంటూ సుమారు 11 మందిని రామచంద్ర పెళ్లి చేసుకున్నాడు. వాళ్లందరూ కూడా అతను పెట్టే బాధలు భరించలేక వెళ్లిపోయారు.

చివరికి నలుగురు పిల్లలకు తల్లిగా ఉన్న సావిత్రి దేవి అనే మరో మహిళను రామచంద్ర 12వ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె గతంలోనే పెళ్లి చేసుకుంది. కానీ తన భర్త చనిపోవడంతో ముగ్గురు కొడుకులు, ఒక కూతురుతో కలిసి జీవనం సాగిస్తోంది. అయితే రామచంద్ర తీరు మాత్రం ఇంకా మారలేదు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తన భార్యతో వాగ్వాదం జరిగింది. కోపంతో రామచంద్ర భార్యపై కర్రతో దాడి చేశాడు. ఆ దెబ్బలను తట్టుకోలేక ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు రామచంద్ర ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..