Telangana: క్వశ్చన్ పేపర్ లీకేజ్‌పై ప్రభుత్వం సీరియస్.. కావాలనే లీక్ చేస్తున్నారంటూ..
తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాలు లీకేజ్ అంశం రాష్ట్రంలో గందరగోళానికి తెర తీయగా తాజాగా పదో తరగతి పరీక్షల పేపర్లు వాట్సాప్‌లో వైరల్ కావడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పదో తరగతి మొదటి పరీక్ష తెలుగు వాట్సాప్‌లో వైరల్‌గా కాగా నేడు...
తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాలు లీకేజ్ అంశం రాష్ట్రంలో గందరగోళానికి తెర తీయగా తాజాగా పదో తరగతి పరీక్షల పేపర్లు వాట్సాప్‌లో వైరల్ కావడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పదో తరగతి మొదటి పరీక్ష తెలుగు వాట్సాప్‌లో వైరల్‌గా కాగా నేడు రెండో పేపర్ హిందీ కూడా వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడం గందరగోళానికి గురి చేసింది.
దీంతో ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఎస్‌ఎస్‌సీ బోర్డ్, ఇతర విద్యాశాఖ అధికారులతో రివ్వ్యూ నిర్వహించారు. కావాలనే పేపర్లను బయటకు వైరల్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టభగ్నం చేసే కుట్రగా దీనిని భావిస్తున్నట్లు మంత్రి ఆరోపించారు. పేపర్లు బయటకు రావడంపై హైలెవల్ దర్యాప్తునకు ఆదేశింఆచరు. కుట్రతో చేశారో, మరో లాభంకోసం చేశారో తేల్చాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
ఇదిలా ఉంటే వరంగల్, హనుమకొండలో పేపర్ లీక్ కాలేదని డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని వివరించారు. నిజాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాలని మంత్రి.. అధికారులను ఆదేశించారు. మరోవైపు ఉప్పల్ పదో తరగతి పరీక్షా కేంద్రం నుంచి హిందీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందన్న వార్తలపై అధికారులు స్పందించారు. ఉప్పల్ పరీక్షా కేంద్రంలో సిబ్బందిని సీఐ, తహసీల్దార్ విచారిస్తున్నారు. తమ కేంద్రం నుంచి పేపర్ బయటకు వెళ్లలేదని అధికారులకు సిబ్బంది తెలిపినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ట్వీట్ చేశారు.. ‘నాలుగు లక్షల 95 వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా పనిచేద్దామని అధికారులకు సూచించారు. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్తితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు పరీక్షల విషయంలో రాజకీయ స్వార్ధం, వ్యక్తిగత స్వార్ధం పక్కన పెట్టాలని మంత్రి మనవి చేశారు.
— SabithaReddy (@SabithaindraTRS) April 4, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..