AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో దారుణం..ప్రియుడ్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన మాజీ ప్రియురాలు..ఎక్కడంటే

ఇటీవల హత్యలు చేసి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఢిల్లీలో శ్రద్ధావాకర్ ని ఆమె ప్రియుడు హత్య చేసి ముక్కలు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే

మరో దారుణం..ప్రియుడ్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన మాజీ ప్రియురాలు..ఎక్కడంటే
Crime
Aravind B
|

Updated on: Apr 04, 2023 | 4:08 PM

Share

ఇటీవల హత్యలు చేసి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఢిల్లీలో శ్రద్ధావాకర్ ని ఆమె ప్రియుడు హత్య చేసి ముక్కలు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ మధ్య ఇలాంటి ఘటనలు మరికొన్ని చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా అలాంటి ఘటనే మరొకటి తమిళనాడులోని చైన్నైలో జరిగింది. ఇక్కడ ఓ మాజి ప్రియురాలు తన ప్రియుడ్ని చంపి ముక్కలుగా నరికి పాతిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే చెన్నైకి చెందిన జయన్తన్..చెన్నై విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మార్చి 18 నుంచి జయన్తన్ కనబడటం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు జయన్తన్ తో చివరిసారిగా అతని మాజీ ప్రియురాలు భాగ్యలక్ష్మీతో మాట్లాడినట్లు గుర్తించారు. ఆమె దగ్గరికి వెళ్లి తమ రీతిలో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. అయితే ఇద్దరి మధ్య గొడవ కావడంతో జయన్తన్ ను హత్య చేసినట్లు భాగ్యలక్ష్మీ ఒప్పుకుంది. అనంతరం అతడ్ని ముక్కలు ముక్కలుగా నరికి చెన్నై శివార్లలోని కొవళం బీచ్ లో పాతిపెట్టినట్లు తెలిపింది. గతంలోనే జయన్తన్ ను వివాహం చేసుకున్నానని.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అతను ఆమెను దూరం పెట్టాడని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లు విచారణలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై