April School Holidays: ఏప్రిల్ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?
వేసవి సెలవుల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక్కపూట బడులు (Half Day Schools) కొనసాగుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలో వేసవి సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. వేసవి సెలవుల్లో భాగంగా ఈసారి 45 రోజులకు పైగా పాఠశాలలకు..

ఏప్రిల్ నెల ప్రారంభమైంది. ఈనెలలో సాధారణ సెలవులతో పాటు వేసవి సెలవులు కూడా రానున్నాయి. ఏప్రిల్ 23తో పాఠశాల చివరి రోజు కానుంది. ఆ తర్వాత నుంచి వేసవి సెలవులు రానున్నాయి. అయితే సెలవులు అంటే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. అయితే వేసవి సెలవులకంటే ముందు ఏప్రిల్ నెలలో పాఠశాలలకు సాధారణ సెలవులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో పండుగలు, ప్రత్యేక దినాల సందర్భంగా విద్యార్థులకు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ నెలలో విద్యాసంస్థలకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో చూద్దాం..
☛ మార్చి 31న -రంజాన్ పండుగ ఉంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ కూడా పండుగ సెలవులు ఉంటుంది. దీంతో రంజాన్‌కు రెండు రోజులు సెలవులు.
☛ ఏప్రిల్ 6న ఆదివారం – ఈరోజు శ్రీరామనవమి. ఆలయాల్లో రాముల వారి పెళ్లి వైభవంగా జరుపుతారు. ఆ రోజున అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
☛ ఏప్రిల్ 10న గురువారం – మహావీర్ జయంతి. ఈ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది.
☛ ఏప్రిల్ 13న ఆదివారం – ఈరోజు ‘బైశాఖి’ నిర్వహిస్తారు. అయితే ఆదివారం కాబట్టి అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది.
☛ ఏప్రిల్ 14న సోమవారం – డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ జయంతి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది.
☛ ఏప్రిల్ 18న శుక్రవారం – ‘గుడ్ ఫ్రైడే’ ఇది ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఉంటుంది. అంతేకాదు బ్యాంకులు సైతం మూసి ఉంటాయి.
నెలలో అనేక రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక రోజులు, పండుగలు రోజుల్లో మాత్రం ఆయా ప్రాంతాలను బట్టి సెలవులు ఉంటాయని గుర్తించుకోండి. ఇది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా అమలు చేస్తారు.
ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు :
ఇదిలా ఉండగా.. వేసవి సెలవుల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక్కపూట బడులు (Half Day Schools) కొనసాగుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలో వేసవి సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. వేసవి సెలవుల్లో భాగంగా ఈసారి 45 రోజులకు పైగా పాఠశాలలకు సెలవులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ప్రకటించి.. తిరిగి జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సెలవులపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి