Viral Video: ఏకంగా కోళ్ల లారీనే కొనేసిన అనంత్ అంబానీ… విషయం తెలిసి అంతా షాక్
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి జంతువులు, పక్షుల మీద ప్రేమను చాటుతూ ఉంటాడు. అందుకోసం ఆయన వంతారా పేరుతో జంతు సంరక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు 140 కి.మీ పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఒక ఘటన ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. అనంత్ అంబానీ తన నడక ప్రయాణం మధ్యలో...

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి జంతువులు, పక్షుల మీద ప్రేమను చాటుతూ ఉంటాడు. అందుకోసం ఆయన వంతారా పేరుతో జంతు సంరక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు 140 కి.మీ పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఒక ఘటన ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు.
అనంత్ అంబానీ తన నడక ప్రయాణం మధ్యలో కోళ్లను రెట్టింపు ధరకు కొనుగోలు చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గత 5 రోజులుగా, అనంత్ అంబానీ ప్రతి రాత్రి 10-12 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే 60 కి.మీ యాత్ర పూర్తి చేసుకున్నారు. గట్టి భద్రత మధ్య నడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన 30వ పుట్టినరోజుకు ముందు ద్వారకకు చేరుకుని శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందాలనేది యాత్ర లక్ష్యం. ఈ క్రమంలో పాదయాత్ర మధ్యలో ఓ కోళ్ల లారీ అనంత్ అంబానీ దృష్టిలో పడుతుంది. వెంటనే లారీ ఆపిస్తాడు. కోళ్ల మందను రక్షిస్తాడు.
వీడియోలో, అతను ఒక పెద్ద లారీ వెనకాల ఒక కోడిని పట్టుకుని, లోపల అనేక కోళ్లు ఉన్నట్లు చూడవచ్చు. అనంత్ అంబానీ చుట్టూ భద్రతా సిబ్బంది ఉంటారు. అన్ని కోళ్లను రక్షించమని ఆదేశిస్తున్నట్లు కనిపిస్తుంది. పక్షుల యజమానికి ఎటువంటి నష్టం జరగకుండా వాటిని రక్షించడానికి కూడా అతను ఆ వ్యక్తికి ఆదేశిస్తాడు. తన తీర్థయాత్రలో అనంత్ అంబానీ మార్గమధ్యలోని దేవాలయాలలో ఆగి పూజలు చేస్తూ యాత్రను కొనసాగిస్తున్నారు.
వీడియో చూడండి:
View this post on Instagram
“ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడిపై విశ్వాసం ఉంచి, ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను, ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది మరియు దేవుడు ఉన్నప్పుడు, ఆందోళన చెందడానికి ఏమీ లేదు” అని అనంత్ అంబానీ వార్తా సంస్థ ANIకి తెలిపారు.
అనంత్ అంబానీ వన్యప్రాణుల సంరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన చేపట్టిన “వంతరా” ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జంతువులను రక్షించారు. ఇందులో 2000 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జంతు సంక్షేమ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి “ప్రాణి మిత్ర” అవార్డుతో సత్కరించింది.