Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kancha Gachibowli Land : ఢిల్లీకి చేరిన కంచ గచ్చిబౌలి భూముల పంచాయితీ.. కేంద్రమంత్రికి బీజేపీ ఫిర్యాదు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం కొనసాగుతోంది. వర్సిటీ భూములు కాపాడుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడమే కాకుండా, ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడుతున్నాయి. తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందంటూ బీజేపీ ఆరోపిస్తుంది. తాజాగా ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

Kancha Gachibowli Land : ఢిల్లీకి చేరిన కంచ గచ్చిబౌలి భూముల పంచాయితీ.. కేంద్రమంత్రికి బీజేపీ ఫిర్యాదు
BJP against auction of Kancha Gachibowli land
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 01, 2025 | 4:01 PM

కంచ గచ్చిబౌలి వివాదాస్పద భూముల వేలం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీ టార్గెట్‌గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. భూములు అమ్మితేగాని ప్రభుత్వం నడవదా ప్రశ్నిస్తోంది బీజేపీ. ఆ పార్టీ ఈ విషయంలో ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తోంది. తాజాగా  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్, నగేశ్ కేంద్రమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని ఎంపీలు కోరారు. నగర పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచ గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరం అని వివరించారు. వందల రకాల ఔషధ మొక్కలు, పక్షులు, వన్య ప్రాణులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని చెప్పారు. ఈ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. HCU విద్యార్థులతోపాటు యావత్ తెలంగాణ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని.. ఎంపీలు కేంద్రమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే కంచ గచ్చిబౌలి భూముల వేలం విషయంలో జోక్యం చేసుకుని.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

స్వర్ణోత్సవ సంవత్సరాన్ని జరుపుకుంటున్న హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సమీపాన ఉన్న ఆ పచ్చని భూముల ఆక్రమణను వెంటనే ఆపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో హెచ్‌.సీ.యూ అభివృద్ది, ఉన్నతి, విస్తరణకు ఆ భూములు ఉపయోగపడతాయన్నారు. అక్కడి భూముల పర్యావరణ ప్రాముఖ్యతను అధ్యయనం చేయడానికి,  స్థిరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి ఒక సమీక్ష కమిటీని ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.