AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forensic Jobs 2026: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్‌డేట్‌ మీ కోసమే

రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌)లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన చేసేందుకు..

Forensic Jobs 2026: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్‌డేట్‌ మీ కోసమే
certificates verification for Forensic Science Laboratory Jobs
Srilakshmi C
|

Updated on: Jan 16, 2026 | 6:36 AM

Share

హైదరాబాద్‌, జనవరి 16: తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌)లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన చేసేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన జనవరి 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో మొత్తం 10 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సంబంధించి ఇంటిమేషన్‌ లెటర్లను అభ్యర్థులు జనవరి 19వ తేదీ అర్ధరాత్రి వరకు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏవైనా ఇబ్బందులు తలెత్తితే మెయిల్‌ support@tslprb.inకు సమాచారం పంపించవచ్చు. లేదంటే 9391005006 నంబరుకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో నిర్వహించే అవకాశం ఉందని ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు తెలిపారు. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 60 సైంటిఫిక్‌ ఆఫీసర్, సైంటిఫిక్‌ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.