Telangana: నాగర్ కర్నూలు జిల్లా గ్యాంప్ రేప్ ఘటనలో సంచలన విషయాలు
నాగర్ కర్నూలు జిల్లా గ్యాంప్ రేప్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి క్రైం హిస్టరీని బట్టబయలు చేసే పనిలో పడ్డారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయా?.. నగలు, డబ్బులు కోసం కూడా దోపిడీలు చేశారా?.. అనే కోణాల్లోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన మహిళపై కొందరు దుండుగులు దారుణానికి ఒడికట్టారు. మొక్కులు తీర్చుకునే క్రమంలో ఓ మహిళ ఆలయంలో నిద్ర చేసేందుకు వెళ్లింది. అర్థరాత్రి వేళ అక్కడి బాత్రూంలు లాక్ చేసి ఉండటంతో… కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆలయ సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి వెళ్లింది. ఆమెకు తోడుగా వెంట వచ్చిన బంధువు కూడా వెళ్లాడు. వారు అలా వెళ్లడాన్ని టెంపుల్ కాంట్రాక్ట్ వర్కర్ గమనించాడు. తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు… సమీప ప్రాంతంలో మద్యం సేవిస్తున్న వారు అక్కడి వచ్చి.. ఆమెను అడ్డగించి అత్యాచారం చేశారు. రాత్రి 12 గంటల ప్రాంతం నుంచి.. తెల్లవారుజామున 3 గంటల వరకు ఒకరి వెంట ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెతోపాటు వచ్చిన మరో వ్యక్తిపైనా దాడి చేసి బంధించి అత్యంత కౄరంగా వ్యవహరించారు. అనంతరం బాధితురాలి పుస్తెలతాడు, చెవి కమ్మలు లాక్కున్నారు. వారి నుంచి బయటపడి ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్వయంగా పర్యవేక్షిస్తూ దుర్మార్గుల పనిపట్టారు. ఏడుగుర్ని అదుపులో తీసుకోగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న నిందితులు.. గతంలోనూ నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఆ దిశగానూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక.. ఘటనాస్థలాన్ని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించారు. ఊర్కొండపేట గ్యాంగ్‌రేప్ ఘటన దురదృష్టకరం అన్నారాయన. బాధితురాలు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లడాన్ని నిందితులు ఆసరాగా తీసుకుని.. సామూహిక అత్యాచారం చేశారని వెల్లడించారు ఐజీ సత్యనారాయణ. అవసరమైతే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు. జాతరలు జరిగే ఆలయాల వద్ద గస్తీ పెంచుతామని చెప్పారు.
కాగా ఈ కేసులో పోలీసులు.. ఇప్పటివరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం ఎంతమంది నిందితులు ఉన్నారనే విషయంపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి