వెంకీ, రవితేజ, నాగార్జునతో బ్లాక్ బస్టర్స్.. ఇప్పుడు ఎందుకో ఇలా.. ఈ బ్యూటీ గుర్తుందా..?
చాలా మంది హీరోయిన్స్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించి ఆతర్వాత మాయం అవుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా వెంకటేష్, నాగార్జున, రవితేజలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.

కొంతమంది హీరోయిన్స్ ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో గుర్తిండిపోతారు. వాళ్లు సినిమాలు చేస్తున్నా.. లేకుండా ప్రేక్షకులు అప్పుడూ వారిని అభిమానిస్తూనే ఉంటారు. చాలా మంది అందాల భామలు తక్కువ సినిమాలతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్స్ గా మారిపోతుంటారు. కొంతమంది గ్లామర్ తో ఆకట్టుకుంటే మరికొంతమంది అభినయంతో మెప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఎంతో మంది అభిమాన తార. తన అందంతో అభినయంతో ఎంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. వెంకటేష్, నాగార్జున, రవితేజతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఏమైందో ఏమో కానీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఆ ముద్దుగుమ్మ. అందంలో అప్సరస ఆమె ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగులో ఆమె 17 సినిమాల్లో నటించింది.. ఆమె ఎవరో కాదు..
తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన అందాల భామ స్నేహ.. తొలి వలపు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అందాల నేహా. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. తెలుగుతోపాటు తమిళ్ లోనూ నటించి ఆకట్టుకుంది. అలాగే తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, సంక్రాంతి, వెంకీ, రాధాగోపాళం, సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధయ రామ సినిమాల్లో నటించి మెప్పించింది.
హీరోయిన్ గా అదరగొట్టిన స్నేహ.. ఆ తర్వాత వదిన పాత్రల్లో నటించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో, రామ్ చరణ్ నటించిన వినయ విధయ రామ సినిమాలో హీరోల వదినగా నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు స్నేహ. ఈ అందాల రీసెంట్ డేస్ లో పెద్దగా కనిపించడం లేదు. కొత్త కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. దాంతో స్నేహ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
