ఏ క్షణానైన మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్స్ కొట్టాం, రేపటిరోజున సెమీఫైనల్స్ కూడా కొట్టబోతున్నాం.. అని మున్సిపల్ పోరుపై ఆశాజనకంగా ఉంది హస్తం పార్టీ. మొత్తం 117 మున్సిపాలిటీలు.. 6 కార్పొరేషన్లు. 52 లక్షలకు పైగా ఉన్న పట్టణ ఓటర్లే టార్గెట్‌గా ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన సాగనుంది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగబోతోంది. ఫిబ్రవరిలోనే అర్బన్ లోకల్ బాడీస్‌కి ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది. ఏ క్షణంలోనైనా షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇటు, రాజకీయ పార్టీలు కూడా బస్తీ మే సవాల్ అంటున్నాయి. ముఖ్యంగా అపోజిషన్ పార్టీ అయితే ఇది సెమీఫైనల్స్ అని ఓపెన్‌గానే అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. మరి, రూలింగ్ పార్టీ మాత్రం సైలెంట్‌గా ఉంటుందా?
మూడుసార్లు కర్రు కాల్చి వాతపెట్టారు, నాలుగోసారి కూడా పెట్టబోతున్నారు అంటూ మున్సిపల్ ఎన్నికలను బూచిగా చూపెట్టి బీఆర్‌ఎస్‌తో మైండ్‌గేమ్ షురూ చేసింది హస్తం పార్టీ. బీఆర్‌ఎస్‌కు గతం తప్ప భవిష్యత్ లేదంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా మున్సిపల్ ఎన్నికలపై ధీమాతో ఉన్నారు. నేతలు కూడా కేడర్‌కు దిశానిర్దేశం చెయ్యడానికి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. సంక్రాంతి పండగ అయిపోగానే మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో బిజీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టూరేసి, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. శుక్రవారం (జనవరి 16) సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించడంతో పాటు, చనాఖాకోర్ట ప్రాజెక్టును సందర్శిస్తారు. ఇక్కడే బహిరంగసభలో ప్రసంగించి, మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
నిజానికి, ఫిబ్రవరి 3వ తేదీన ప్లాన్ చేసిన జడ్చర్ల బహిరంగ సభ నుంచి మున్సిపల్ పోరు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ, సమయం సరిపోదన్న కారణంతో ప్లాన్ బీని అమలు చేస్తున్నారు. ఇవాళ్టి ఆదిలాబాద్ టూర్ నుంచే పట్టణ ఓటరును ప్రసన్నం చేసుకోబోతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
అటు, అపోజిషన్ పార్టీ బీఆర్‌ఎస్ కూడా దూకుడు మీదుంది. ఇప్పటికే జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి లీడర్లను అప్రమత్తం చేస్తున్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు, పార్టీ జిల్లా ప్రెసిడెంట్లతో వరుసగా భేటీ అవుతూ భరోసా నింపుతున్నారు. కానీ, జూబ్లీహిల్స్ ఇచ్చిన గెలుపును, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన నంబర్స్‌ను ఎడ్వాంటేజ్‌గా తీసుకుని ఫుల్ జోష్‌తో ఉంది రూలింగ్ పార్టీ.
క్వార్టర్ ఫైనల్స్ కొట్టాం, రేపటిరోజున సెమీఫైనల్స్ కూడా కొట్టబోతున్నాం.. అని మున్సిపల్ పోరుపై ఆశాజనకంగా ఉంది హస్తం పార్టీ. మొత్తం 117 మున్సిపాలిటీలు.. 6 కార్పొరేషన్లు. 52 లక్షలకు పైగా ఉన్న పట్టణ ఓటర్లే టార్గెట్‌గా ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన సాగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
