AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mayawati: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారీటీ ఇచ్చిన బీఎస్పీ చీఫ్ మాయావతి..

బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షురాలు మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని తమ పార్టీ కలవబోవడంలేదని తేల్చీ చెప్పేశారు. అంతేకాదు.. ఆ పార్టీలతోనే కాకుండా ఇంకా ఏ ఇతర పార్టీతో కూడా పొత్తులు పెట్టుకునేది లేదని స్పష్టం చేసేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు అలాగే ఇతర కార్యవర్గంతోనూ భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Mayawati: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారీటీ ఇచ్చిన బీఎస్పీ చీఫ్ మాయావతి..
Bsp Chief Mayawati
Aravind B
|

Updated on: Oct 01, 2023 | 7:17 PM

Share

బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షురాలు మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని తమ పార్టీ కలవబోవడంలేదని తేల్చీ చెప్పేశారు. అంతేకాదు.. ఆ పార్టీలతోనే కాకుండా ఇంకా ఏ ఇతర పార్టీతో కూడా పొత్తులు పెట్టుకునేది లేదని స్పష్టం చేసేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు అలాగే ఇతర కార్యవర్గంతోనూ భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోను, ఉత్తరాఖండ్‌లోనూ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మన పార్టీ సొంత బలాన్ని నమ్ముకుని.. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటన చేసేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూనే.. బీఎస్పీ కార్యవర్గమంతా పార్టీని బలోపేతం చేసే విషయంలో మరింతగా దృష్టి పెట్టాలని సూచనలు చేశారు.

అలాగే పార్టీ సభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఫేక్ మెసేజులతో మన ప్రత్యర్థులు రాజకీయ కుట్రలకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే బీఎస్పీ వ్యతిరేక శక్తులు మన గెలుపును అడ్డుకునేందుకు ఏమి చేయడానికైనా కూడా వెనకాడవని పేర్కొన్నారు. అలాగే ప్రతి దశలో కూడా ఎప్పటికపుడూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు చేశారు. అలాగే దీని కారణంగా మన పార్టీ ఎన్నికల ప్రణాళిక అనేది అసలు దెబ్బ తినకూడదని వ్యాఖ్యానించారు. మరోవైపు అధికార బీజేపీ పార్టీ పరిపాలనపై కూడా మాయవతి స్పందించారు. బీజేపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. ద్రవ్యోల్బణం,పేదరికం, నిరుద్యోగం, శాంతిభద్రతల లోపం, విద్య, వైద్యం లాంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మరోవైపు ఏదీ సరిగ్గా లేదని చెబుతూనే ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల విషయాల దగ్గరికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరు ఒకేలా ఉంటుందని అన్నారు. పూర్తిగా ప్రజా వ్యతిరేక ధోరణిలో ఆ పార్టీల వ్యవహారం ఉంటుందని విమర్శలు చేశారు.

మరోవైపు నిరుద్యోగ సమస్యను కూడా నిర్మూలించేందుకు రిజర్వేషన్‌ను ప్రతిపాదికగా తీసుకోకూడదని మాయావతి వ్యాఖ్యానించారు. అలాగే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్నటువంటి బుల్‌డోజర్ యాక్షన్లపై కూడా ఆమె స్పందించారు. అసలు ఒక వ్యక్తి దోషి అని నిరూపితం కాక ముందే వారికి చెందిన ఆస్తులను ధ్వంసం చేసే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పైగా ఆ వ్యక్తి చేసిన తప్పుకు మొత్తం కుటుంబాన్నే శిక్షిస్తున్నారని అన్నారు. అసలు ఇది ఏ మాత్రం ఆమోదించదగిన విషయం కాదని పేర్కొన్నారు. అలాగే ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానమని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.