PG Doctor Suicide Case: పీజీ డాక్టర్ సింధుజ అనుమానాస్పద మృతి.. ఏం జరిగిందో..?
పీజీ మెడికల్ విద్యార్ధిని అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని చైన్నెకి చెందిన వెంకటాచలం అనే వ్యక్తి కుమార్తె సింధుజ (28). తమిళనాడులో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సింధుజ ఆ తరువాత పీజీ ఎంట్రన్స్ రాసి పరీక్షలు రాసి పీజీ అనస్తీషియా కోర్సులో ప్రవేశం పొందింది. కోర్సులో భాగంగా కొళ్లేగాల్ ప్రభుత్వ సబ్ డివిజన్ వైద్యా కాలేజీలో అనెస్థీషియా డిపార్ట్‌మెంట్‌లో..

బెంగళూరు, అక్టోబర్ 1: పీజీ మెడికల్ విద్యార్ధిని అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని చైన్నెకి చెందిన వెంకటాచలం అనే వ్యక్తి కుమార్తె సింధుజ (28). తమిళనాడులో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సింధుజ ఆ తరువాత పీజీ ఎంట్రన్స్ రాసి పరీక్షలు రాసి పీజీ అనస్తీషియా కోర్సులో ప్రవేశం పొందింది. కోర్సులో భాగంగా కొళ్లేగాల్ ప్రభుత్వ సబ్ డివిజన్ వైద్యా కాలేజీలో అనెస్థీషియా డిపార్ట్‌మెంట్‌లో గత 8 నెలలుగా విధులు నిర్వహిస్తోంది. శ్రీమహాదేశ్వర కాలేజీ రోడ్డులో అద్దె ఇంటిలో ఉంటూ చదువుకుంటోన్న సింధూజ రెండు రోజులుగా తరగతులకు హాజరుకావడం లేదు.
డాక్టర్లు, స్టాఫ్‌తో ఎంతో కలివిడిగా ఉండే సింధూజ కనిపించకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. గురువారం తన డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిందని, అప్పటి నుంచి ఆమె కనిపించడం లేదని తోటి వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం ఆమె విధులకు హాజరుకాకపోవడంతో మరో డాక్టర్ లోకేశ్వరి సింధూజ ఫోన్‌కు కాల్ చేసింది. అయినా ఆమె స్పందించక పోవడంతో అనుమానం వచ్చిన ఆస్పత్రి సిబ్బంది ఏం జరిగిందో తెలుసుకుని రమ్మని ఒకరిని ఆమె ఇంటికి పంపారు.
అలా వెళ్లిన వ్యక్తి తలుపు కొట్టినా ఎలాంటి సమాధానం రాకపోడంతో కిటికీలో నుంచి చూశాడు. గదిలోపల సింధుజ నేలపైన బోర్లా పడి ఉండటం చూసి వెంటనే ఆసుపత్రి యాజమన్యానికి సమాచారం అందించారు. గది తలుపులు లోపలి నుంచి గొళ్లెం పెట్టి ఉండటంతో పోలీసులు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆమె పక్కనే సిరెంజి, చాకు కనిపించడంతో విషపూరిత ఔషధాలను తీసుకుని చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా డాక్టర్ సింధూజ పెళ్లి జనవరి 2, 2024న జరగనుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న తమ కూతురు హఠాత్తుగా మృతి చెందడంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు డీఎస్పీ సోమెగౌడ మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.