AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పిల్లల కోసం బిస్కెట్లు, బెలూన్లు కొన్నారు.. ఇంటికి తీసుకురాగా.. వాటి మీద రాసినది చూసి

పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్లు, బెలూన్లు కొన్నారు. ఇంటికి తీసుకొచ్చి వాటిని ఊదారు. అంతే.! వాటిని చూసేటప్పటికి దెబ్బకు షాక్ అయ్యారు. అందులో రాసినవి ఏంటంటే.? ఆ వివరాలు ఇలా.. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. చెక్ చేసేయండి.

Viral: పిల్లల కోసం బిస్కెట్లు, బెలూన్లు కొన్నారు.. ఇంటికి తీసుకురాగా.. వాటి మీద రాసినది చూసి
Trending
Noor Mohammed Shaik
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 01, 2025 | 1:38 PM

Share

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో పాకిస్తాన్‌ బెలూన్లు కలకలం రేపాయి. బిస్కెట్ ప్యాకెట్లలో పాకిస్తాన్ జెండాలు, వాటిపై 14 ఆగష్టు స్వాతంత్ర్య వేడుక అని రాసి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. గంగ్‌ధర్ సబ్‌డివిజన్‌లో పిల్లలకు అమ్మే బిస్కెట్ ప్యాకెట్లలో పాకిస్తాన్ జెండాలు, ఆకుపచ్చ రంగులో ఉండే ఆగస్టు 14 స్వాతంత్ర్య వేడుక అనే బెలూన్లు కనిపించడం ఈ ప్రాంతంలో తీవ్ర చర్చలకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రహ్లాద్ రాథోడ్ అనే వ్యక్తి కిరాణాషాపులో తన పిల్లలకు బిస్కెట్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లారు. కాసేపటికే పిల్లలు ప్యాకెట్‌లో ఉన్న బెలూన్‌ను గాలితో నింపగానే, అందులో పాకిస్తాన్ జెండా, ఆగస్టు 14 స్వాతంత్ర్య వేడుక అని వ్రాసిన బెలూన్ కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పొరుగువారికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి ఘటనలు దేశానికి విఘాతం కలిగించగలవని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా

పిల్లల అమాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఒక దేశ వ్యతిరేక కుట్ర అని ఆరోపించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కిరాణా దుకాణం నుంచి అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకుని వాటిని స్టేషన్‌లో భద్రంగా ఉంచారు. ఈ వస్తువులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలోట్ నుంచి డెలివరీ చేశారని దుకాణదారుడు పోలీసులకు వెల్లడించాడు. వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సరఫరా నెట్‌వర్క్‌ను పరిశీలిస్తున్నారు. ఈ బిస్కెట్ ప్యాకెట్లను సరఫరా చేసిన మధ్యప్రదేశ్‌లోని అలోట్‌కు ఒక బృందం చేరుకుంది. బిస్కెట్ ప్యాకెట్లపై పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని తయారీ కంపెనీ చిరునామా కూడా ఉంది. నిందితుడైన సరఫరాదారుని అరెస్టు చేసిన తర్వాత ఈ సంఘటనలోని పూర్తి వివరాలు బయటపెడతామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం