AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 75 ఏళ్ల వృద్ధుడు.. మర్నాడే ఘోరం..!

వృద్ధాప్యంలో మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవిత భాగస్వామితో ఇంటికి వచ్చిన సంగరు రామ్ కి తన జీవితంలో పెళ్లి రోజే చివరి రోజని బహుశా తెలియకపోవచ్చు. మన్భవతి చెప్పిన ప్రకారం వివాహం తర్వాత సోమవారం వారిద్దరూ ఇంటికి వచ్చారు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. రాత్రి భోజనం తర్వాత తన భర్త ఇద్దరుకొడుకులతో ఇంటి బయట పడుకున్నాడు.

Viral Video: 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 75 ఏళ్ల వృద్ధుడు.. మర్నాడే ఘోరం..!
75 Year Old Man Marries 35 Year Old Woman In UpImage Credit source: X @GauravKSD
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 01, 2025 | 7:42 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో, 75 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్ల మహిళను కోర్టులో వివాహం చేసుకున్నాడు. తర్వాత ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన మరుసటి రోజే వృద్ధ భర్త అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కుచ్‌ముచ్ గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో నివసించే 75 ఏళ్ల సంగ్రూరామ్ ఒక సంవత్సరం క్రితం తన భార్యను కోల్పోయాడు. సంగ్రూర్‌కు పిల్లలు లేరు. ఒంటరిగా నివసిస్తున్నాడు. దీంతో తాను జీవితాంతం జీవిత భాగస్వామితో గడపాలని నిర్ణయించుకున్నాడు. సంగ్రూర్ కోర్టులో 35 ఏళ్ల మన్భవతి అనే ముగ్గురు పిల్లల తల్లిని రెండవ వివాహం చేసుకున్నాడు.

రెండవ భార్య ఏమి చెప్పిందంటే

తన వృద్ధ భర్త సంగ్రురామ్ మరణించిన తర్వాత.. ముగ్గురు పిల్లల తల్లి అయిన మన్భవతి.. మాట్లాడుతూ.. తమ వివాహానికి ముందు సంగ్రురామ్ తన ఆస్తిని.. తన పేరు మీద బదిలీ చేస్తానని తనకు హామీ ఇచ్చాడని చెప్పింది. అంతేకాదు తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కొక్కరికి లక్ష రూపాయలను కూడా డిపాజిట్ చేస్తానన్నాడని చెప్పింది. దీంతో సంగ్రురామ్ మాటలను నమ్మ.. తాను కోర్టులో వివాహం చేసుకున్నామని.. అయితే పెళ్లి జరిగిన మర్నాడే సంగ్రురామ్ మరణించాడని చెప్పింది.

ఇవి కూడా చదవండి

మొదటి భార్య మరణం తర్వాత

ఒక సంవత్సరం క్రితం సంగ్రురామ్ మొదటి భార్య మరణించింది. ఆ తరువాత సంగ్రురామ్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. అయితే సంగ్రురామ్ అన్నయ్య మంగ్రు రామ్ కుటుంబం, ఇతర గ్రామస్తుల నుంచి చాలా ఒత్తిడి వచ్చింది. సంగ్రురామ్ మేనల్లుళ్ళు ఢిల్లీకి వచ్చి తమతో నివసించాలని సూచించారు. తమ దగ్గర ఉంటే తిండికి ఉండడానికి ఎటువంటి సమస్య కలుగదని చెప్పారు. అయితే సంగ్రురామ్ నిరాకరించాడు.. పైగా తన భూమిలో కొంత భాగాన్ని అమ్మేసి.. జలల్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న 35 ఏళ్ల ముగ్గురు పిల్లల తల్లి అయిన మన్భవతిని వివాహం చేసుకున్నాడు.

ఇద్దరూ కోర్టులో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత స్థానికుల సమక్షంలో ఒక ఆలయంలో పూలమాలలు మార్చుకున్నారు. సంగ్రురామ్.. మన్భవతి నుదుట సింధూరం దిద్ది తన భార్యగా చేసుకున్నాడు. మన్భవతి తన (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు) ముగ్గురు పిల్లలతో కలిసి సంగ్రురామ్ ఇంటికి వెళ్ళింది. అయితే మర్నాడే ఆమె భర్త మరణించాడు.

పెళ్లి జరిగిన మరుసటి రోజే సంగ్రు మరణం

వృద్ధాప్యంలో మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవిత భాగస్వామితో ఇంటికి వచ్చిన సంగరు రామ్ కి తన జీవితంలో పెళ్లి రోజే చివరి రోజని బహుశా తెలియకపోవచ్చు. మన్భవతి చెప్పిన ప్రకారం వివాహం తర్వాత సోమవారం వారిద్దరూ ఇంటికి వచ్చారు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. రాత్రి భోజనం తర్వాత తన భర్త ఇద్దరుకొడుకులతో ఇంటి బయట పడుకున్నాడు. తనని తన కుమార్తెతో కలిసి ఇంటి లోపల పడుకోమని కోరాడు. మంగళవారం ఉదయం.. తాను వెళ్లి భర్తని నిద్రలేపినట్లు…బయట ఉన్న మంచం మీద పడుకున్న అతని మెడ వేలాడుతూ కనిపించిందని చెప్పింది.

అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు

తన భర్త సంగ్రూరామ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని మన్భవతి వివరించింది. అకస్మాత్తుగా అతని పరిస్థితి విషమంగా మారి మెడ వంగిపోవడం ప్రారంభమైంది. ఇది చూసిన మన్భవతి ఆజాద్ అనే యువకుడికి ఫోన్ చేసి వైద్యుడిని పిలవమని కోరింది. ఆజాద్.. వైద్యుడుతో కలిసి ఇంటి వచ్చాడు. సంగ్రూరామ్ పరిస్థితి చూసి వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లమని డాక్టర్ సలహా ఇచ్చాడు. ఆజాద్ ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి సంగ్రూరామ్‌ను మన్భవతితో కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ వైద్యులు అప్పటికే సంగ్రూరామ్ మరణించాడని చెప్పారు.

అంత్యక్రియలు నిర్వహించడానికి నో చెప్పిన బంధువులు

సంగ్రూ మరణ వార్త అందగానే ఢిల్లీలో నివసిస్తున్న సంగ్రూ అన్నయ్య మంగ్రూ రామ్ కుమారులు వెంటనే ఫోన్ చేసి సంగ్రూ మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం తీసుకెళ్లకుండా ఆపారు. మృతుడి మేనల్లుళ్ళు ఇప్పటికే ఢిల్లీ నుంచి తమ కుటుంబాలతో కలిసి తమ గ్రామానికి బయలుదేరారు. మరణానికి నిజమైన కారణం పోస్ట్‌మార్టం తర్వాత మాత్రమే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని స్థానికులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..