AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్తాన్ లో వింత గబ్బిలాలు.. నక్కలాంటి రూపంలో పొడవైన గబ్బిలాలు

రాజస్థాన్‌లో ఒక వింత గబ్బిలం కనిపించింది. రాష్ట్రంలోని భిల్వారాలో రెక్కల భారీగా ఉన్న గబ్బిలం కనిపించింది. ఈ గబ్బిలం మూడు అడుగుల పొడవు ఉంది. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే ఈ విచిత్ర గబ్బిలం రాత్రి ఎగిరిపోయింది. అయితే ఇలాంటిదే మరో గబ్బిలం చెట్టుకు వేలాడుతూ చనిపోయి కనిపించింది.

రాజస్తాన్ లో వింత గబ్బిలాలు.. నక్కలాంటి రూపంలో పొడవైన గబ్బిలాలు
Viral News
Surya Kala
|

Updated on: Oct 01, 2025 | 1:19 PM

Share

రాజస్థాన్‌లోని భిల్వారాలో రెండు వింత గబ్బిలాలు కనిపించడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. షాపురా ప్రాంతంలోని సుర్లి కళ్యాణ్‌పురా గ్రామంలో ఈ విచిత్ర గబ్బిలాలను గుర్తించారు. వీటి రెక్కల పొడవు ఐదు అడుగులు, రెండు గబ్బిలాలు మూడు అడుగుల పొడవు ఉన్నాయి. ఒక గబ్బిలం ఎగిరిపోయింది, మరొకటి సమీపంలోని చెట్టుకు చనిపోయి వేలాడుతూ కనిపించింది. చనిపోయిన గబ్బిలాన్ని ప్రజలు నిశితంగా పరిశీలించినప్పుడు.. ఈ గబ్బిలం ముఖం నక్కను పోలి ఉందని వారు గ్రహించారు.

అయితే ఈ రకమైన గబ్బిలాలు భారత ఉపఖండం అంతటా కనిపిస్తాయని అటవీ శాఖ విశ్వసిస్తోంది. సుర్లి కళ్యాణ్‌పురా గ్రామ నివాసితులు తమ జీవితంలో మొదటిసారిగా ఇలాంటి గబ్బిలాలను చూశామని చెబుతున్నారు. కొందరు తమ మొబైల్ ఫోన్‌లను పని చెప్పి ఈ విచిత్ర గబ్బిలాల ఫోటోలు తీశారు.

విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉందన్న గ్రామస్తులు

విద్యుత్ తీగపై వాలినప్పుడు.. విద్యుదాఘాతం తగిలి ఒక గబ్బిలం నేలపై పడిపోయిందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఉదయం వెలుతురుని చూడలేకపోయిన గబ్బిలం ఎగరలేకపోయింది. ఈ గబ్బిలానికి భయంకరమైన కళ్ళు, ముక్కు రంధ్రాలు విప్పి, తెరిచినప్పుడు పదునైన దంతాలు, కోణాల చెవులు, రెక్కల కింద పదునైన పంజాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఫారెస్ట్ అధికారి ఏమి చెప్పాడంటే

మండల్‌గఢ్ అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ పాయల్ మాథుర్ మాట్లాడుతూ.. ఈ జాతి గబ్బిలాలు సాధారణంగా భారత ఉపఖండంలో కనిపిస్తాయని అన్నారు. వీటి ముఖాలు నక్క లేదా కుక్క ముఖాలను పోలి ఉంటాయి, అందుకే వీటికి ఎగిరే నక్క అనే పేరు వచ్చింది. వీటికి కోణకారంలో చెవులు, పెద్ద కళ్ళు ఉంటాయి. వీటి ప్రధాన లక్షణం ఏమిటంటే పండ్లు, తేనె , పుప్పొడిని తింటాయి. మానవులకు ప్రమాదకరం కాదు. పరాగసంపర్కం , విత్తనాల వ్యాప్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాళ్ళతో సహా వీటి రెక్కలు విస్తరించినప్పుడు ఐదు అడుగుల వెడల్పు వరకు ఉంటాయి. రాత్రి చీకటిలో ఈ గబ్బిలాలు ఎరను గుర్తించడానికి రాడార్ లాంటి ఎకోలొకేషన్‌ను ఉపయోగిస్తాయి. అయితే ఇవి పగటిపూట గుడ్డిగా మారతాయి.

చిన్న పక్షులను వేటాడటం

ఈ గబ్బిలాలు మానవులకు ప్రమాదకరం కాదు. ఆకలి కారణంగా మాంసాహారులుగా మారతాయి. రాత్రి సమయంలో చిన్న పక్షులు, ఎలుకలు, కుందేళ్ళను వేటాడి ఆకలి తీర్చుకుంటాయి. ఈ గబ్బిలాలు కోటలోని చంబల్ అటవీ ప్రాంతంలో కనిపిస్తాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us