Bird flu : అలర్ట్‌.. ! మరోమారు దేశంలో బర్డ్‌ ఫ్లూ కలకలం.. అక్కడి కడక్‌ నాథ్‌ కోళ్లలో కొత్త వేరియంట్‌..

బర్డ్ ఫ్లూ సోకిన కిలోమీటరు దూరం ప్రాంతాన్ని వైరస్ జోన్ గా పరిగణించి అన్ని రకాల పశువులకు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నామని పశువైద్య విభాగం డైరెక్టరు తెలిపారు.

Bird flu : అలర్ట్‌.. ! మరోమారు దేశంలో బర్డ్‌ ఫ్లూ కలకలం.. అక్కడి కడక్‌ నాథ్‌ కోళ్లలో కొత్త వేరియంట్‌..
Chicken Price
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 22, 2023 | 12:18 PM

జార్ఖండ్ రాష్ట్రంలో బర్ట్ ప్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ అధ్వర్యంలో కొనసాగిస్తున్న కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. బొకారో జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోహాంచల్ లోని ప్రసిద్ద కడక్ నాథ్ కోళ్ల మాంసంలో హెచ్5ఎన్1 వేరియంట్ ఉన్నట్లు నిర్థారించారు. లోహంచల్‌లోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా కడక్‌నాథ్ కోళ్లు చనిపోయాయి. అధిక ప్రొటీన్లు ఉండే కడక్ నాథ్ కొళ్లలో ఈ వేరియంట్ ను గుర్తించారు.ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాలను ప్రభావిత జోన్ గా ప్రకటించారు. పౌల్ట్రీకి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో నిఘాను పెంచారు. ప్రభావిత ప్రాంతాల్లో కొళ్లు, బాతుల అమ్మకాలతో పాటు మాంసం అమ్మకాలను కూడా ప్రభుత్వం నిషేధించింది.

బర్డ్ ఫ్లూ విషయంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి అరుణ్ కుమార్ వెల్లడించారు. బొకారో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. పెద్ద పౌల్ట్రీ ఫారమ్ కోళ్లు, బాతుల నమూనాలను పరిశీలించడానికి ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు వ్యాధి సోకిన జోన్‌లో నివసిస్తున్న వ్యక్తుల నమూనాలను సేకరించాలని అధికారులు వైద్య బృందాన్ని ఆదేశించారు. కొన్ని రోజుల పాటు చికెన్, బాతు మాంసాన్ని తినడం మానేయాలని ప్రజలకు హెల్త్ అధికారులు సూచించారు.

మనుషుల్లో ఈ వ్యాధి వస్తే.. తీవ్రమైన వెన్నునొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, జలుబు, కఫంలో రక్తం వంటి లక్షణాలు ఉంటాయి. ఎవరికైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉంటే చికిత్స కోసం ముందస్తుగానే ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ సోకడంతో పక్షుల మలమూత్రాలు, దాణా, గుడ్లను ధ్వంసం చేసి, పౌల్ట్రీ ఫాంలో క్రిమిసంహారక మందు స్ప్రే చేశామని అధికారులు చెప్పారు. బర్డ్ ఫ్లూ సోకిన కిలోమీటరు దూరం ప్రాంతాన్ని వైరస్ జోన్ గా పరిగణించి అన్ని రకాల పశువులకు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నామని పశువైద్య విభాగం డైరెక్టరు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..