AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చెక్కి తిరుగుతున్న భారీ ఏనుగు.. 12 రోజుల్లో 16 మందిని చంపేసింది..

తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా అటవీ అధికారి తెలిపారు. అదే ఏనుగు కాష్‌పూర్-లడై తాంగ్రాలో మరో నలుగురిపై దాడి చేసింది.

పిచ్చెక్కి తిరుగుతున్న భారీ ఏనుగు.. 12 రోజుల్లో 16 మందిని చంపేసింది..
Jyothi Gadda
|

Updated on: Feb 22, 2023 | 11:21 AM

Share

ఝార్ఖండ్‌లో ఓ ఏనుగు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తోంది. కనిపించిన వారినల్లా చంపుకుంటూ పోతోంది. గత 12 రోజుల్లో ఐదు జిల్లాల్లో 16 మందిని బలితీసుకుంది. ఒక్క రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది. 24గంటల్లో5మందిని తొక్కి చంపింది ఏనుగు..దీనిని బంధించేందుకు పశ్చిమబెంగాల్ నుంచి నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నారు. జార్ఖండ్‌లోని లోహర్‌దగాలోని రెండు బ్లాక్‌లలో ఆదివారం నుండి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏనుగు ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని చంపింది.

మొదటి సంఘటన ఆదివారం సల్గి-మసియాతు గ్రామంలో జరిగింది. ఒక మహిళ స్కూల్‌ బిల్డింగ్‌ సమీపంలో నిలబడి ఉండగా ఏనుగు ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా అటవీ అధికారి తెలిపారు. అదే ఏనుగు కాష్‌పూర్-లడై తాంగ్రాలో మరో నలుగురిపై దాడి చేసింది. సోమవారం ఉదయం బహిర్భుమికి వెళ్లిన ముగ్గురిపై ఏనుగు విచక్షణా రహితంగా దాడి చేసింది. కాగా చికిత్స పొందుతూ వారు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు మరణించారు. గత కొద్ది రోజులుగా ఏనుగు లోహర్దగా డివిజనల్ అధికారి అర్బింద్ కుమార్ తెలిపారు. మరోవైపు ఏనుగులను తిరిగి అడవికి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నామని, గ్రామస్థులు ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఏనుగులను త్వరగా బంధించి తమ ప్రాణాలను కాపాడాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు.

మరోవైపు ఏనుగుల దాడుల్లో గత ఐదేళ్లలో జార్ఖండ్‌లో 462 మంది మరణించారని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ మంత్రి సత్య ప్రకాష్‌ తెలిపారు. 2021-22లో 133 మంది మరణించారని, 2020-21లో ఆ సంఖ్య 84కి చేరుకుందని, 2021-22లో 133 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంతానం లేనివారికి వెల్లుల్లి చేసే మేలు గురించి తెలుసా?
సంతానం లేనివారికి వెల్లుల్లి చేసే మేలు గురించి తెలుసా?
మహిళా క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్..మ్యాచ్ ఫీజులు డబుల్ ధమాకా
మహిళా క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్..మ్యాచ్ ఫీజులు డబుల్ ధమాకా
అయ్యో దేవుడా.. పెళ్లైన 27 రోజులకే ఇంత ఘోరమా.. ఏం జరిగిందంటే..?
అయ్యో దేవుడా.. పెళ్లైన 27 రోజులకే ఇంత ఘోరమా.. ఏం జరిగిందంటే..?
డైనోసార్ల కంటే పాతవి.. ఆరావళి పర్వతాల గురించి మీకు తెలుసా?
డైనోసార్ల కంటే పాతవి.. ఆరావళి పర్వతాల గురించి మీకు తెలుసా?
పారిపోయి ప్రియుడితో యువతి పెళ్లి... తండ్రి షాకింగ్ డెసిషన్!
పారిపోయి ప్రియుడితో యువతి పెళ్లి... తండ్రి షాకింగ్ డెసిషన్!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఏలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఏలా ఉంటుంది..
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
తిన్న తర్వాత ఎన్ని అడుగులు నడవాలి.. ఎక్కువ నడిస్తే ఏమవుతుంది..?
తిన్న తర్వాత ఎన్ని అడుగులు నడవాలి.. ఎక్కువ నడిస్తే ఏమవుతుంది..?
'ధురంధర్' మూవీ హీరోయిన్ తండ్రి టాలీవుడ్‌ స్టార్ నటుడని తెలుసా?
'ధురంధర్' మూవీ హీరోయిన్ తండ్రి టాలీవుడ్‌ స్టార్ నటుడని తెలుసా?