AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: ముఖంపై మచ్చలతో విసుగెత్తిపోతున్నారా..? కొబ్బరితో ఇలా చేస్తే నిగనిగలాడే మెరుపు ఖాయం..!

మీరు ముఖంపై మచ్చలు, చర్మం ముడతలతో బాధపడుతున్నట్లయితే మీరు కొబ్బరి నూనె చిట్కాలను పాటించండి.. ప్రతిరోజూ అప్లై చేస్తే, మీ చర్మం శుభ్రంగా, నిగినిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది.

Skin Care Tips: ముఖంపై మచ్చలతో విసుగెత్తిపోతున్నారా..? కొబ్బరితో ఇలా చేస్తే నిగనిగలాడే మెరుపు ఖాయం..!
Skin Care Tips
Jyothi Gadda
|

Updated on: Feb 22, 2023 | 9:00 AM

Share

ప్రతి సీజన్‌లో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ చర్మం నిర్జీవంగా మారిపోతుంది. అంతే కాదు 30ఏళ్ల తర్వాత చర్మంలో ముడతలు వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి, మహిళలు అనేక రకాల సౌందర్య సాధనాలను కూడా ఉపయోగిస్తారు. కానీ వాటిని ఉపయోగించడం వల్ల మీ చర్మం దెబ్బతింటుంది. మీరు ముఖంపై మచ్చలు, చర్మం ముడతలతో బాధపడుతున్నట్లయితే మీరు కొబ్బరి నూనె చిట్కాలను పాటించండి.. కొబ్బరి నూనెను ముఖానికి ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

కొబ్బరి నూనెను ముఖానికి ఇలా అప్లై చేయాలి.. విటమిన్ ఇ ఆయిల్ – కొబ్బరి నూనె: విటమిన్ ఇ,కొబ్బరి నూనె మిశ్రమం చర్మం ముడుతలకు చికిత్స చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కట్ చేసి, ఆపై కొబ్బరి నూనెలో కలపండి. బాగా కలిపిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ముఖంపై అప్లై చేసి మసాజ్ చేయాలి. విటమిన్ ఇ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది డల్ స్కిన్‌ని రిఫ్రెష్ చేస్తుంది. మీ చర్మంపై ముడతల సమస్యను తొలగిస్తుంది.

పసుపు- కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో పసుపు కలిపి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది. కొబ్బరి నూనెలో పసుపు వేసి బాగా కలపాలి. ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా ఆరనివ్వండి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ- కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. దానికి పచ్చి పాలను కూడా యాడ్‌ చేయాలి. ఇప్పుడు అన్నింటినీ బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత మీ ముఖానికి అప్లై చేసి చేతులతో మృదువుగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ముడతల సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజూ అప్లై చేస్తే, మీ చర్మం శుభ్రంగా, నిగినిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై