Travelling: ఇండియన్స్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. ప్రయాణాలపై నెలకు పెడుతున్న ఖర్చు తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే..

ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నచ్చిన ప్లేస్ కు వెళ్తే వచ్చే ఆ మానసిక ఆనందమే వేరు. మనదేశంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. చూసే మనసుండాలే..

Travelling: ఇండియన్స్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. ప్రయాణాలపై నెలకు పెడుతున్న ఖర్చు తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే..
Travelling
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 22, 2023 | 8:37 AM

ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నచ్చిన ప్లేస్ కు వెళ్తే వచ్చే ఆ మానసిక ఆనందమే వేరు. మనదేశంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. చూసే మనసుండాలే గానీ.. ప్రతీదీ అద్భుతమే కదా.. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే భారతీయులు.. ప్రతి నెలా దాదాపు 1 బిలియన్ డాలర్ల విదేశీ ప్రయాణాలకు వెచ్చిస్తున్నారు. ఇది కొవిడ్‌కు ముందు ఉన్న స్థాయిల కంటే చాలా ఎక్కువ అని రిజర్వ్ బ్యాంక్ రెమిటెన్స్‌ల డేటా వెల్లడించింది. 2022-23 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ప్రయాణాల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) ద్వారా భారతీయులు జరిపిన చెల్లింపులు USD 9.95 బిలియన్లు. ఆర్బీఐ డేటా ప్రకారం 2021-22లో ప్రయాణానికి సంబంధించిన ఖర్చు USD 4.16 బిలియన్లు, 2019-20కి ముందు కొవిడ్ సంవత్సరంలో USD 5.4 బిలియన్లు. మొత్తం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణానికి జరిగిన చెల్లింపులు USD 7 బిలియన్లు.

భారతీయులు తమ కుటుంబాలు లేదా స్నేహితులతో ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. వియత్నాం, థాయిలాండ్, యూరప్, బాలి వంటి ప్రదేశాలు.. భారతీయులు ఇష్టపడే కొన్ని ప్రధాన టూరిస్ట్ ప్రాంతాలు. ప్రయాణ సౌకర్యాల పెరుగుదల, సాంకేతిక పురోగతితో ట్రావెల్ పరిశ్రమ అంతర్జాతీయ గమ్యస్థానాల్లో భారీ బూమ్‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇప్పుడే ప్రయాణం చేసి తరువాత చెల్లించండి అనే విధానం టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాబట్టి.. గోవా కోసం వెతుకుతున్న వ్యక్తి ఇప్పుడు థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు, థాయ్‌లాండ్ కోసం ప్లాన్ చేసే వ్యక్తి సుదూర ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు.

మరోవైపు.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేటును ప్రస్తుత 5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన భారతీయుల విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. RBI డేటా ప్రకారం.. ప్రధానంగా కోవిడ్-19 వ్యాప్తి తరువాత పరిమితుల కారణంగా 2020-21లో బయటి ప్రయాణాలపై ఖర్చు USD 3.23 బిలియన్లకు పడిపోయింది. 2019-20 మరియు 2018-19లో ప్రయాణానికి సంబంధించిన బాహ్య చెల్లింపులు వరుసగా USD 6.95 మరియు USD 4.8 బిలియన్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..