Viral Video: ఓరి నాయనో.. షూస్ వేసుకునేటప్పుడు జాగ్రత్త గురూ.. ఈ వీడియో చూస్తే తడిసిపోవాల్సిందే

పాములు చూస్తే వెనక్కి తిరిగి పారిపోతుంటాం అలాటిది మన కాళ్ళ ముందు ప్రత్యక్షం అయితే ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైనే పోతాయి.

Viral Video: ఓరి నాయనో.. షూస్ వేసుకునేటప్పుడు జాగ్రత్త గురూ.. ఈ వీడియో చూస్తే తడిసిపోవాల్సిందే
Snake
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 21, 2023 | 8:08 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోల్లో జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. జంతువులు పోట్లాడుకునేవి, అలాగే కొన్ని ఫన్నీ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక పాములను చూస్తే భయపడని వారు ఎవరుంటారు. పాములు చూస్తే వెనక్కి తిరిగి పారిపోతుంటాం అలాటిది మన కాళ్ళ ముందు ప్రత్యక్షం అయితే ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైనే పోతాయి. అందులో కొన్నింటిని చూస్తే నిజంగానే షాక్ అవుతాం. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఒక్కోసారి స్కూటీ లోపల అలాగే కొన్నిసార్లు ఇంట్లో పాములు కనిపిస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఊహించని విధంగా షూస్ లోపల పాము కనిపించింది. విషపూరితమైన నాగుపాము షూస్ లోపల ఎలా దాక్కుంది.

ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి బయటకు వెళ్లడానికి బూట్లు వేసుకోవడానికి వచ్చినప్పుడు షూ చూసి షాక్ అయ్యాడు. షూస్ వేసుకోవడానికి వెళ్లిన అతడి  షూ లోపల నాగు పాము కనిపించింది.  పామును బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే అది బుసలు గొడుతూ పాడగా విప్పి నిలుచుంది. ఈ ఇది కర్ణాటకకు చెందిన వీడియో అని అంటున్నారు. ఈ వీడియో కాస్త పాతదే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.