G20 Summit: ఆర్థికాభివృద్ధికి దిక్సూచిగా బెంగళూరు G20 సమావేశాలు.. ప్రపంచ సమస్యలపై చర్చించనున్న ఆర్థిక మంత్రులు
ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు బెంగళూరు వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 22 నుంచి 25 తేదీల్లో బెంగళూరులో సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు విడతల జి-20 సమావేశాలు బెంగళూరులో నిర్వహించగా..
జీ-20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. భారీ ఎత్తున సన్నాహక సదస్సులతోపాటు, పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు బెంగళూరు వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 22 నుంచి 25 తేదీల్లో బెంగళూరులో సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు విడతల జి-20 సమావేశాలు బెంగళూరులో నిర్వహించగా.. ఇదే సమావేశాల అనుశీలన, ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్లు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలను చిక్కబళ్లాపుర, నందిబెట్ట పరిసరాల్లోని హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాల వివరాలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేథ్, ఆర్థికశాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ అనంత నాగేశ్వరన్ మంగళవారం బెంగళూరులో తెలిపారు.
గత డిసెంబరు 13- 17 మధ్య ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ (ఎప్‌సీబీడీ)ల తొలి సమావేశం నిర్వహించారు. రెండో విడత సమావేశం బుధవారం ప్రారంభం కానుంది. కేంద్ర సమాచార, ప్రసార, యువజన క్రీడా వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ మైఖేల్ పాత్ర, ఆర్థికశాఖ కార్యదర్శి అజయ్‌సేథ్ అధ్యక్షత వహిస్తారు. అయితే, గురువారం మాత్రం చర్చలు జరుగుతాయి. అనంతరం.. తొలి ఆర్థిక శాఖ మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశాలు 24, 25 తేదీల్లో మొదలు పెడతారు. వాటికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ డాక్టర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షత వహించనున్నారు.
ప్రపంచ ఆర్థిక అంశాలపై చర్చించ్చ..
విశేషమేంటంటే, భారత్ అధ్యక్షతన జరగనున్న G20 ఆర్థిక శాఖ మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల(FMCBG), ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ(FCBD) సమావేశానికి G20 72 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో ముఖ్యమైన అంశాలు చర్చించబడతాయి. గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ హెల్త్, అంతర్జాతీయ పన్నులకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇది కాకుండా, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్రిప్టో ఆస్తులపై విధాన దృక్పథం, క్రాస్ బోర్డర్‌లో జాతీయ చెల్లింపు వ్యవస్థ పాత్ర వంటి అంశాలు కూడా చర్చించనున్నారు.
ఫిబ్రవరి 22-23 తేదీలలో FCBD సమావేశం
అదే సమయంలో, ఆర్థిక శాఖ మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి ముందు, G20 ఫైనాన్స్, సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధుల (FCBD) సమావేశం ఫిబ్రవరి 22-23 తేదీలలో జరుగుతుంది. అయితే, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిబ్రవరి 22న G20 రెండవ FCBD సమావేశాన్ని ప్రారంభించనున్నారు. ఎఫ్‌సిబిడి సమావేశానికి ఆర్థిక కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ మైఖేల్ డి పాత్ర సహ అధ్యక్షత వహిస్తారు.
ఈ అంశాలపైన ప్రధాన చర్చ..
అయితే, తొలి ఎఫ్‌సీబీడీ సమావేశంలో చర్చించిన అంశాల రిపోర్టుపైనే రెండో సమావేశంలో తీర్మానాలు చేయనున్నారు. తొలి ఎఫ్‌ఎంసీబీడీ సమావేశంలో భౌగోళిక ఆర్థిక సమస్యలు, విధానాల వినియమం, 21వ శతాబ్దిలో బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు ఎదుర్కొనే సవాళ్లు, నగరాల అభివృద్ధికి దోహదపడే ఆర్థికతను సృష్టించే దిశగా జి-20 దేశాల సమష్టి కార్యాచరణపై తీర్మానాలు చేస్తారు ప్రతినిధుల బృందం. ఇందులో భాగంగా సుస్థిర, సమగ్ర ఆర్థికత, డిజిటల్ వ్యవస్థ, బ్యాంకింగ్ ఉత్పత్తులు, భౌగోళిక ఆరోగ్యం, అంతర్జాతీయ పన్నుల విధానాలపై ఇక్కడ ప్రధానంగా చర్చిస్తారు. ఈ సందర్భంగా జీ-20 ఫైనాన్స్ ట్రాక్-2023 కోసం ప్రతిపాదనలు ఈ రిపోర్టును రెడీ చేస్తారు. ప్రజలను డిజిటల్ చెల్లింపుల విధానానికి మరింత ఫ్రెండ్లీగా మార్చేందుకు బ్యాంకుల పాత్ర, క్రిప్టో కరెన్సీ, జాతీయ చెల్లింపులు, అంతర్జాతీయ సరిహద్దుల నగదు వినిమయంపై కూడా ఈ రెండో సమావేశంలో చర్చిస్తారు.
FMCBG మూడు సెషన్లలో..
భారతదేశంలో G20 ఫైనాన్స్ ట్రాక్ మొదటి FMCBG సమావేశం ఫిబ్రవరి 24-25 తేదీలలో మూడు సెషన్లలో జరుగుతుంది. 21వ శతాబ్దంలో సాధారణ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను బలోపేతం చేయడం దీని ఉద్దేశం. గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ టాక్సేషన్‌కు సంబంధించిన అంశాలు మూడు సెషన్లలో చర్చించబడతాయి. ఆర్థిక చేరిక, ఉత్పాదకత లాభాలను పెంచడం వంటి సమస్యలు కూడా కవర్ చేయబడతాయి.
G20 ప్రతినిధుల కోసం అనేక సైడ్ ఈవెంట్‌లు
జి-20దేశాలకు చెందిన 72 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. భారతీయ పర్యాటక, ఆహార, సాంస్కృతిక శైలిని ప్రతిబింబించే కార్యక్రమాలకు వేదిక కానున్నాయి. “రాత్రి భోజ్ పర్ సంవాద్”.. కార్యక్రమంలో మన దేశ ఆహారశైలి, సంస్కృతిపై అవగాహన కల్పిస్తారు. కర్ణాటక, భారతీయ సంప్రదాయ నృత్యాలతో అతిథుల ఆహ్వానం, స్వదేశీ హస్తకళలపై అవగాహన, 26న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వీడియోను ఇక్కడ చూడండి
మరిన్ని జాతీయ వార్తల కోసం