Gold Price: మన దేశంలో కంటే చాలా తక్కువ ధరకు బంగారం లభించే దేశాలు ఇవే.. కానీ అదే సమస్య..
భారతదేశంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. అయితే బంగారం ధరలు చాలా తక్కువగా ఉన్న అనేక దేశాలు ఉన్నాయి. మీరు ఈ దేశాల నుంచి చాలా తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. కాబట్టి తక్కువ ధరలో బంగారం ఎక్కడ లభిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

బంగారం పరుగులు పెడుతోంది. న్యూ ఇయర్ నుంచి బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. గ్యాప్ లేకుండా పైపైకి ఎగబాగుతూ రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది గోల్డ్ రేట్. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయని..అదే ట్రెండ్ దేశీ మార్కెట్‌లోనూ కొనసాగుతోందని అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. భారత్‌లో బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక గ్రాము బంగారం కొనడానికి కూడా చాలా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. డబ్బు పొదుపు కోసం విదేశాల నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడం చాలాసార్లు మీరు చూసి ఉంటారు. కానీ అక్రమంగా తీసుకొచ్చినందుకు విమానాశ్రయంలో కూడా పట్టుబడటం వేరే విషయం.
భారత్ వెలుపల ఎంత బంగారం దొరుకుతుందో మీకు తెలుసా..? ప్రజలు బయటి నుంచి బంగారాన్ని ఏ కారణంతో కొనుగోలు చేస్తారు. అసలు బంగారం ధర చాలా తక్కువగా ఉన్న దేశాల ఏంటో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.. ఈ సమాచారం తర్వాత.. మీరు కూడా ఆ దేశాలకు వెళితే బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు.
తక్కువ ధరలో బంగారం ఎక్కడ లభిస్తుంది?
చౌకైన బంగారం ఎక్కడ లభిస్తుందనే సమాచారాన్ని అందించే ముందు.. బంగారం ధరలు ప్రపంచమంతటా దాదాపు సమానంగా ఉన్నాయి. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే, రేటులో పెద్దగా తేడా లేదు. కానీ ఇతర దేశాల కరెన్సీ ప్రకారం, బంగారం రేటు తగ్గుతుంది. ప్రపంచంలో తక్కువ ధరలో బంగారం కొనాలంటే హాంకాంగ్‌కు వెళ్లాల్సిందేనని నమ్ముతారు. హాంకాంగ్‌లో బంగారం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ బంగారం చౌకగా పరిగణించబడుతుంది. అయితే, భారతీయ కరెన్సీతో పోల్చినప్పుడు, రేటులో పెద్దగా తేడా ఉండదు.
ఉదాహరణకు, ఇవాళ్టి బంగారం ధరను పరిశీలిస్తే, హాంకాంగ్‌లో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 4835 హాంకాంగ్ డాలర్లు. మీరు దానిని భారతీయ కరెన్సీలోకి మార్చినట్లయితే, నేటికి 4835 హాంకాంగ్ డాలర్లు అంటే దాదాపు 52 వేల రూపాయలు. అదే సమయంలో, ఈ రోజు భారతదేశంలో బంగారం ధర దాదాపు 58 వేల రూపాయలు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలో దాదాపు 6 వేల రూపాయల తేడా మాత్రమే ఉంది. మీరు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే, విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయడం మీకు లాభదాయకమైన ఒప్పందం అని చెప్పవచ్చు
దుబాయ్ పరిస్థితి కూడా ఇదేనా?
దుబాయ్ వెళ్ళే భారతీయులు దుబాయ్ నుంచి బంగారం కొనడానికి ఇష్టపడతారు. బంగారం ధరలో పెద్దగా తేడా లేకపోయినా దుబాయ్‌లో బంగారం స్వచ్ఛతనే ఎక్కువగా పరిగణిస్తారు. దుబాయ్‌లోని బంగారం ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉంటుంది. అందుకే దుబాయ్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేయాలనుకోవడానికి దాని స్వచ్ఛత కూడా ఒక కారణం. అంతే కాకుండా బంగారంతో చేసిన ఆభరణాల డిజైన్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇదే కారణంగా దుబాయ్ నుంచి కూడా బంగారాన్ని కొనేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం




