Rahul Gandhi: పెళ్లి, పిల్లలపై మనసులోని మాట బయటపెట్టిన రాహుల్ గాంధీ.. బోలెడు ఇంట్రస్టింగ్ విషయాలు..
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ వారసుడు రాహుల్ గాంధీ వయస్సు ఇప్పుడు 52 ఏళ్లు. ఇన్నేళ్లు గడిచినా ఆయన పెళ్లిపై ఎలాంటి స్పందనా లేదు. అయితే, తాజాగా పెళ్లి, పిల్లల అంశంపై రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ వారసుడు రాహుల్ గాంధీ వయస్సు ఇప్పుడు 52 ఏళ్లు. ఇన్నేళ్లు గడిచినా ఆయన పెళ్లిపై ఎలాంటి స్పందనా లేదు. అయితే, తాజాగా పెళ్లి, పిల్లల అంశంపై రాహుల్ గాంధీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్‌ను ఇటలీకి చెందిన మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో చాలా ఇంట్రస్టింగ్ అంశాలను ప్రస్తావించారు రాహుల్ గాంధీ. దివంగత మాజీ ప్రధాని, తన నానమ్మ ఇందిరాగాంధీకి తానంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక ఇటలీలోని అమ్మమ్మ పావ్‌లామాయినోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ప్రాణమని చెప్పుకొచ్చారు.
ఇక తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘పెళ్లి ఎందుకు చేసుకోలేదో నాకే తెలియదు. ఆ విషయం నాకే విచిత్రంగా ఉంటుంది. పిల్లలు కావాలని ఉంది. కానీ, చాలా పనులు చేయాల్సి ఉంది.’ అని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో పెద్దగా పెరిగి గడ్డం గురించి ప్రస్తావించగా.. గడ్డం తీసే సమయం వచ్చినట్లుందని రిప్లై ఇచ్చారు. వాస్తవానికి భారత్ జోడో యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం గీసుకోవద్దని నిర్ణయించుకున్నానని, ఇప్పుడు ఆ గడ్డాన్ని ఉంచాలా? తీసేయాలా? అనేది డిసైడ్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..