Vande Bharat Trains: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు భారీగా పెరిగిన క్రేజ్.. 60 మంది ఎంపీల నుంచి డిమాండ్.. వీరంతా బీజేపీ వారు కాదండి బాబోయ్..
రయ్‌ని దూసుకెళ్లే బుల్లెట్ ట్రెయిన్.. ఇది మన దేశానికి ఎప్పుడొస్తుందో అంటూ ఊహించుకునే వారి కల సాకారం అయ్యింది. ఇటీవలే దర్జాగా పట్టాలెక్కిన వందేభారత్ రైలుకు ఇప్పుడు క్రేజ్ మరింత పెరిగింది.
నేలమీది విమానం.. వేల కిలోమీటర్ల వేగం.. రయ్‌ని దూసుకెళ్లే బుల్లెట్ ట్రెయిన్.. ఇది మన దేశానికి ఎప్పుడొస్తుందో అంటూ ఊహించుకునే వారి కల సాకారం అయ్యింది. ఇటీవలే దర్జాగా పట్టాలెక్కిన వందేభారత్ రైలుకు ఇప్పుడు క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం దేశంలో మొత్తం పది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి గరిష్టంగా నాలుగు రైళ్లు నడుస్తున్నాయి. సెమీ-హై-స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల మొదటి ఎంపికగా మారింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దాదాపు 10 రూట్లలో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా వందేభారత్‌పై ఎంపీల్లో క్రేజ్ పెరగడం మొదలైంది. దాదాపు 60 మంది ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఈ రైళ్లను ప్రారంభించాలని భారతీయ రైల్వేని అభ్యర్థించారు. ఈ ఎంపీలలో 14 మంది ఎన్డీయేతర పార్టీలకు చెందిన వారు ఉండటం విశేషం.
వీటిలో ఎక్కువ డిమాండ్లు బీజేపీ ఎంపీల నుంచే వచ్చాయి. ఇందులో సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు. షోలాపూర్-ముంబై మధ్య రైలు నడపాలని డిమాండ్ చేశారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు, గ్వాలియర్‌కు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను అభ్యర్థించారు.
ప్రతిపక్ష పార్టీల్లోనూ తాకిన వందేభారత్ క్రేజ్
ప్రతిపక్ష పార్టీలలో.. ఎన్‌సిపి, డిఎంకె, ఎస్‌పి, ఆప్, జెడి(యు)లకు చెందిన ఒక్కొక్క ఎంపీ తమ నియోజకవర్గాలకు వందేభారత్ రైలును డిమాండ్ చేయగా.. కాంగ్రెస్, సీపీఐ(ఎం)కి చెందిన ముగ్గురు ఎంపీలు, వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా డిమాండ్ చేశారు. అప్నాదళ్, శివసేనలకు చెందిన ఒక్కో ఎంపీ కూడా ఈ రైళ్లను డిమాండ్ చేసిన వారిలో ఉన్నారు.
వందే భారత్ రైలు ఎందుకు మొదటి ఎంపిక
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తుంది. ఈ రైలులో ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, టచ్-ఫ్రీ స్లైడింగ్ డోర్లు, CCTVలతో పాటు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రివాల్వింగ్ సీట్లు వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ రైలు గంటకు 160 కి.మీ వేగాన్ని అందుకోవడానికి కేవలం 129 సెకన్లు మాత్రమే పడుతుంది. దేశంలో ఇలాంటి మొత్తం పది రైళ్లు సర్వీసులో ఉన్నాయి. అందులో నాలుగు ఒకే రాష్ట్రంలో (మహారాష్ట్ర) పనిచేస్తున్నాయి.
ఢిల్లీ-వారణాసి వందే భారత్ రైలు దేశంలో మొదటి సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది ఫిబ్రవరి 2019లో ఫ్లాగ్ ఆఫ్ చేయబడింది. పశ్చిమ బెంగాల్‌లో మొదటిది అయిన ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హౌరా- NJP మార్గంలో 560 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారతీయ రైల్వే నడుపుతున్న ఏడు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం