అరుదైన పాముకు రూ.కోటి బేరం.. డీల్ కుదుర్చుకునేందుకు మకాం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..
ఈ భూమిపై జీవించేందుకు మనుషులకు ఎంత స్వేచ్ఛ ఉందో.. ఇతర జీవాలకూ అంతే ఉంది. కానీ.. మనుషులు తమ స్వార్థాల కోసం వాటిని పణంగా పెడుతున్నాడు. నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు...
ఈ భూమిపై జీవించేందుకు మనుషులకు ఎంత స్వేచ్ఛ ఉందో.. ఇతర జీవాలకూ అంతే ఉంది. కానీ.. మనుషులు తమ స్వార్థాల కోసం వాటిని పణంగా పెడుతున్నాడు. నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా వాటి ప్రాణాలు తీసేందుకూ వెనకాడటం లేదు. తాజాగా పశ్చిమబంగలో ఇలాంటి ఘటనే జరిగింది. అరుదైన పామును రూ.కోటికి అమ్మతున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు.. దాడి చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ లోని సిలిగిరి మున్సిపాలిటీలోని శాస్త్రి నగర్లో పామును స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన సర్పాన్ని రూ.కోటికి విక్రయించేందుకు ప్రయత్నించిన వారిని పట్టుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు, పోలీసులు ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి ‘రెడ్ శాండ్ బోవా’ అనే అరుదైన జాతికి చెందిన పామును స్వాధీనం చేసుకున్నారు.
రూ.కోటి విలువైన రెడ్ శాండ్ బొవా జాతి పామును బిహార్ నుంచి తీసుకొచ్చారు. బైకాంతపుర్ ఫారెస్ట్ డివిజన్లోని ఓ ఇంట్లో దీన్ని ఉంచారు. విషయం తెలుసుకున్న బేలాకోబా రేంజ్ అధికారి సంజయ్ దత్తా నేతృత్వంలోని బృందం స్మగ్లర్లపై దాడి చేసింది. స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు 4.5 కిలోల బరువు ఉన్న పామును స్వాధీనం చేసుకున్నారు. వెల్లడించారు.
పెషాంగ్ లామాతో పాము స్మగ్లింగ్ విషయమై నిందితులు చర్చలు జరుపారని, బేరసారాలు కుదిరిన తర్వాతే పామును తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. అతడితో డీల్ మాట్లాడుకునేందుకే వీరంతా శాస్త్రి నగర్లో మకాం పెట్టారన్నారు. ఈ ఘటనలో అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తం ఏదైనా ఉందేమోనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..