Aadhaar Card: ఆధార్ కార్డు జిరాక్స్‌లపై నెట్టింట జోరుగా ప్రచారం.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాదేది వార్తకు అనర్హం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఎవరికి ఏది తోచితే దాన్ని వార్త మలిచేస్తున్నారు. అంతటితో ఆగకుండా సదరు వార్తను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వార్తలో అసలు నిజానిజాలు కూడా తెలుసుకోకుండా తెగ షేర్ చేసేస్తున్నారు...
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాదేది వార్తకు అనర్హం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఎవరికి ఏది తోచితే దాన్ని వార్త మలిచేస్తున్నారు. అంతటితో ఆగకుండా సదరు వార్తను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వార్తలో అసలు నిజానిజాలు కూడా తెలుసుకోకుండా తెగ షేర్ చేసేస్తున్నారు. ఇలా ఎన్నోసార్లు తప్పుడు వార్తలు శర వేగంగా హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆధార్ కార్డు విషయంలో ఇలాంటి ఓ వార్తనే నెటిజన్లను గందరగోళానికి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అన్ని పనులకు ఆధార్ తప్పనిసరిగా మారిన విషయం తెలిసిందే. ప్రతీ చిన్న పనికీ ఆధార్ కార్డు జిరాక్స్ అడుగుతున్నారు. అయితే ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఎవరికీ ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా చేయడం వల్ల ఆధార్ డేటాను దొంగలిచ్చే ప్రమాదం ఉందని, ఇకపై ఎవరు ఆధార్ జిరాక్స్ అడిగినా ఇవ్వకూడదంటూ సదరు పోస్టులో ఉన్న సారంశం. అయితే దీనిపై అధికారులు స్పందించారు.
Beware! Fake Message Alert! Please Ignore. pic.twitter.com/RNEyzebJ5R
— Aadhaar (@UIDAI) February 21, 2023
సోషల్ మీడియా వేదికగానే ఈ ప్రచారినిక చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయమై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆధార్ కార్డు జిరాక్స్‌లపై జరుగుతోన్న ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ ట్వీట్ చేసింది. చూశారుగా వాట్సాప్‌లో వచ్చింది కదా అని ఏది పడితే అది ఫార్వర్డ్ చేయడం ఆపేయండి, ఇలాంటి ఫేక్ వార్తలను వైరల్ చేయడంలో భాగమవ్వకండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..