బీహార్‌లో కొలిక్కి వచ్చిన NDA సీట్ల సర్దుబాటు.. చెరో 101 స్థానాల్లో బీజేపీ, జేడీయూ పోటీ..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకుNDA కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చింది. భారతీయ జనతా పార్టీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేయనుండగా, చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 29 సీట్లు కేటాయించారు. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని.. హిందుస్థానీ అవామ్ మోర్చాకు 6 స్థానాలు దక్కాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకుNDA కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చింది. భారతీయ జనతా పార్టీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేయనుండగా, చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 29 సీట్లు కేటాయించారు. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చాకు 6 స్థానాలు దక్కాయి. ఉపేంద్ర కుష్వా నేతృతంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాపార్టీకి 6 సీట్లు కేటాయించారు. ఈ ప్రకటన తర్వాత, NDA కూటమి సీట్ల పంపకాల ఒప్పందాన్ని సుహృద్భావ వాతావరణంలో పూర్తి చేసిందని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.
బీహార్‌లో సీట్ల పొత్తు చర్చలు కొలిక్కి వస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్ధుబాటుపై ఢిల్లీలో బీజేపీ నేతల కీలక సమావేశం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన భేటీ అమిత్‌షాతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. అక్టోబర్ 13వ తేదీన బీజేపీ అభ్యర్ధుల జాబితా విడదలయ్యే అవకాశం ఉంది. ఎల్‌జేపీ అధ్యక్షడు చిరాగ్ పాశ్వాన్‌తో బీజేపీ నేతల మంతనాలు జరిపారు. సీట్ల సర్ధుబాటు కోలిక్కి రావడంతో సంతోషంగా ట్వీట్ చేశారు.
हम एनडीए (NDA) परिवार ने सौहार्दपूर्ण वातावरण में बिहार विधानसभा चुनाव 2025 के लिए सीटों का बंटवारा पूरा किया है।
🔹 BJP : 101🔹 JDU : 101🔹 LJP (R) : 29🔹 RLM : 06🔹 HAM : 06
बिहार है तैयार —फिर से NDA सरकार,इस बार पूरे दम के साथ #BiharFirstBihariFirst के साथ!#NDA…
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 12, 2025
త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు, NDA సభ్యులందరూ పరస్పర అంగీకారంతో సీట్ల పంపిణీని సుహృద్భావ వాతావరణంలో పూర్తి చేశారని, బీజేపీ బీహార్ ఇన్‌చార్జ్ వినోద్ తవ్డే అన్నారు. ఈ నిర్ణయాన్ని అన్ని ఎన్డీఏ పార్టీల నాయకులు, కార్యకర్తలులు ఆనందంగా స్వాగతించారని వినోద్ తవ్డే అన్నారు. బీహార్‌లో మరో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని మిత్రదేశాలు సిద్ధంగా ఉన్నాయని, దృఢ సంకల్పంతో ఉన్నాయని ఆయన తెలిపారు. అన్ని NDA పార్టీల నాయకులు, కార్యకర్తలు దీనిని ఆనందంగా స్వాగతించారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటిచారు.
हम एनडीए के साथियों ने सौहार्दपूर्ण वातावरण में सीटों का वितरण पूर्ण किया।
BJP – 101JDU – 101LJP (R) – 29RLM – 06HAM – 06
एनडीए के सभी दलों के कार्यकर्ता और नेता इसका हर्षपूर्वक स्वागत करते हैं।
बिहार है तैयार,फिर से एनडीए सरकार।#NDA4Bihar ✌️
— Dharmendra Pradhan (@dpradhanbjp) October 12, 2025
బీజేపీ – 101 సీట్లు
జేడీయూ – 101 సీట్లు
ఎల్‌జేపీ (రామ్ విలాస్) – 29 సీట్లు
RLMO – 06 సీట్లు
HAM – 06 సీట్లు
NDAలో సీట్ల పంపకాల ఏర్పాటు గురించి కేంద్ర మంత్రి, HAM వ్యవస్థాపకుడు జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, “ఎటువంటి ఆగ్రహం లేదా ఫిర్యాదు లేదు. మేమందరం సంతృప్తి చెందాము. మాకు ఆరు సీట్లు వచ్చాయి. కాబట్టి ఇది హైకమాండ్ నిర్ణయం. మేము దానిని అంగీకరిస్తున్నాము” అని అన్నారు.
#WATCH | Patna | On Hindustani Awam Morcha (HAM) getting six seats to contest in #BiharElections2025, party leader and Union Minister and Hindustan Jitan Ram Manjhi says, "In the Parliament, we were given only one seat, were we upset? Similarly, if we got only 6 seats, it is the… pic.twitter.com/XhdgscsJI7
— ANI (@ANI) October 12, 2025
బీహార్‌లో మెత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న జరుగుతుంది. 121 స్థానాలకు. రెండవ దశ పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. 122 స్థానాలకు. ఫలితాలు నవంబర్ 14న ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో 74.2 మిలియన్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో 39.2 మిలియన్లు పురుషులు, 34.9 మిలియన్లు మహిళలు. రెండు దశల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు NDA కూటమిలో ఐదు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. బీహార్‌లో థర్డ్‌ఫ్రంట్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్ధులను బరిలోకి దింపుతోంది. 16 జిల్లాల్లో 32 మంది అభ్యర్ధుల తొలి జాబితాను మజ్లిస్ పార్టీ విడుదల చేసింది. 100 సీట్లలో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
మరోవైపు అక్టోబర్ 15వ తేదీ నుంచి బీహార్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ నెల 15న బీజేపీ కార్యకర్తలతో మోదీ మాట్లాడుతారు. మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్ ప్రచారంలో పాల్గొనాలని.. తమ సూచనలు నమో యాప్‌లో పంచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తల సూచనలపై ప్రధాని మోదీ సమావేశంలో చర్చిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




