Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railways: ఇది కదా గుడ్‌ న్యూస్‌ అంటే.. సబర్బన్‌కి కూడా మెట్రో తరహా AC కోచ్‌లు!

బెంగళూరు శివారు రైలు ప్రాజెక్టు కోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ఏసీ కోచ్‌లను సరఫరా చేయనుంది. కె-రైడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఐసీఎఫ్, మెట్రో లాంటి ఏసీ కోచ్‌లను డిజైన్ చేస్తుంది. 2026 డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోచ్‌ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,135 కోట్లు మంజూరు చేసింది.

Railways: ఇది కదా గుడ్‌ న్యూస్‌ అంటే.. సబర్బన్‌కి కూడా మెట్రో తరహా AC కోచ్‌లు!
K Ride
Follow us
SN Pasha

|

Updated on: Mar 21, 2025 | 9:51 AM

బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టు కోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, మెట్రో లాంటి ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లను సరఫరా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో యూనిట్‌ ఉన్న ఐసీఎఫ్ ఇటీవల “రోలింగ్ స్టాక్ కోసం కార్-బాడీ, బోగీ, ఇంటీరియర్ డిజైన్ల అభివృద్ధి కోసం” డిజైన్ ఏజెన్సీల నుండి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(EOI)లను ఆహ్వానించింది. ఇవి వందే మెట్రో కోచ్‌లు కావు, కర్ణాటక రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (కె-రైడ్) అవసరాలను తీర్చడానికి రూపొందించిన మెట్రో లాంటి ఏసీ కోచ్‌లు అని అధికారులు తెలిపారు.

రైల్వే మంత్రిత్వ శాఖ, కర్ణాటక ప్రభుత్వం కలిసి జాయింట్ వెంచర్గా K-RIDE, బ్రాడ్-గేజ్ సబర్బన్ రైలు ప్రాజెక్టును చేపట్టాయి. ఈ కోచ్ 21.7 మీటర్ల పొడవుతో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ఉంటుంది, 95 కి.మీ. సురక్షిత వేగం, 85 కి.మీ. కార్యాచరణ వేగం, 17 టన్నుల యాక్సిల్ లోడ్ కోసం బోగీ డిజైన్ ఉంటుంది. ఇంటీరియర్స్‌లో సీటింగ్ ఏర్పాట్లు, లైటింగ్, వెంటిలేషన్, సమాచార వ్యవస్థలు, యాక్సెసిబిలిటీ ఫీచర్లు సంబంధిత ప్రమాణాలు, ప్రయాణీకుల సౌకర్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రతి ఆరు కోచ్‌ల రైలు 1,052 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుంది. K-RIDE డిసెంబర్ 2026 నాటికి కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఫిబ్రవరిలో బెంగళూరు పర్యటన సందర్భంగా రోలింగ్ స్టాక్‌పై డెవలప్‌మెంట్‌ తెలుస్తోంది.

సరఫరాను వేగవంతం చేయడానికి ఐసీఎఫ్ నుండి రోలింగ్ స్టాక్‌ను సేకరించాలని ఆయన కె-రైడ్‌కి చెప్పారు. కారిడార్ C2 (బయ్యప్పనహళ్లి-చిక్కబనవర) డిసెంబర్ 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని, కారిడార్ 4 (హీలలిగే-రాజనకుంటే) వచ్చే డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మొదటి దశలో రెండు కారిడార్‌ల కోసం మూడు కోచ్ కాన్ఫిగరేషన్‌లతో కూడిన 51 రైళ్లను – మొత్తం 153 కోచ్‌లను – కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 2026 నాటికి మూడు-నాలుగు రైళ్లను అందించడానికి ఐసీఎఫ్ అంగీకరించినట్లు సమాచారం. అయితే, వీటి డిజైన్‌కు ఒకటి, ఒకటిన్నర సంవత్సరాలు పట్టవచ్చని, ఆ తర్వాత ఉత్పత్తి, విడుదలకు మరో రెండు సంవత్సరాల సమయం పట్టవచ్చని, పరీక్షకు అదనంగా ఆరు నెలలు అవసరమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంటే 2028 చివరి నాటికి ఈ రైలు పట్టాలు ఎక్కే ఛాన్స్‌ ఉంది.

K-RIDE టెండర్ లేకుండా నేరుగా కోచ్‌లను కొనుగోలు చేస్తున్నందున, కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ చట్టంలోని సెక్షన్ 4(g) కింద టెండర్ మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. గత సంవత్సరం, కర్ణాటక మంత్రివర్గం ఈ ప్రాజెక్టు కోసం 306 రైలు కోచ్‌ల (రోలింగ్ స్టాక్) కొనుగోలు కోసం రాష్ట్ర వాటా రూ.2,135 కోట్లను ఆమోదించింది. “రోలింగ్ స్టాక్ అంచనా వ్యయం రూ. 4,300 కోట్లు, రాష్ట్రం రూ. 2,135 కోట్లు (50 శాతం) చెల్లిస్తుండగా, మిగిలిన 50 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో 306 కోచ్‌లను కొనుగోలు చేయడానికి ఈ మొత్తాన్ని K-RIDEకి ఇస్తామని అని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ తెలిపారు.

149 కిలో మీటర్ల సబర్బన్ రైలు నెట్‌వర్క్ కోసం లీజింగ్ మోడల్ కింద 300 కోచ్‌లను (50 ఆరు కోచ్‌ల రైళ్లు) చేర్చాలని K-RIDE ప్రణాళిక వేసింది. కంపెనీల నుండి అంతగా స్పందన లేకపోవడంతో, కొనుగోలు నమూనాను ఎంచుకోవలసి వచ్చింది. 2020 లో ఈ ప్రాజెక్టును ఆమోదించేటప్పుడు, ఖర్చులను తగ్గించడానికి లీజు నమూనా కింద కోచ్‌లను కేంద్రం సిఫార్సు చేసింది. రోలింగ్ స్టాక్ కోసం PPP మోడల్ కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ.18,621 కోట్ల నుండి రూ.15,767 కోట్లకు తగ్గిందని వర్గాలు తెలిపాయి. అయితే, రోలింగ్ స్టాక్ సంస్థలు తక్కువ తక్షణ రాబడితో పెద్ద పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడాయి. ప్రాజెక్ట్ ఆమోదంలో పీపీపీ మోడల్ కింద కోచ్‌లను సేకరించడానికి ఒక షరతు ఉన్నందున, నీతి ఆయోగ్ నుండి ఆమోదం పొందిన తర్వాత తమ వాటాను అందిస్తామని రైల్వే బోర్డు హామీ ఇచ్చినట్లు సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.