Gautam Adani: అవునా నిజమా.. అదానీ సోదరుడు రైల్వే స్టేషన్ వద్ద చాట్ అమ్ముకుంటున్నాడా? అన్న బిలియనీర్.. తమ్ముడు రోడ్డుపై..!
గౌతం అదానీని పోలిన వ్యక్తి ముంబైలో చాట్ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి ఆ వ్యక్తి అదానీ సోదరుడు కాదు. అదానీని పోలి ఉండటంతో వీడియో సరదాగా షేర్ చేయబడింది. ప్రముఖులను పోలిన వ్యక్తులు అకస్మాత్తుగా వైరల్ అవుతున్న సంఘటనలు ఇది మరో ఉదాహరణ.

అపర కుబేరుడు గౌతమ్ అదానీ సోదరుడు ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్ సమీపంలో చాట్ అమ్ముతున్నాడనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అతను చాట్ అమ్ముతున్న వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అన్న బిలియనీర్, తమ్ముడు ఇలా రోడ్డు పక్కన చాట్ వ్యాపారి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అతను నిజంగానే అదానీ తమ్ముడా అంటే..? కాదు. అచ్చం అదానీలా కనిపించడంతో ఎవరో సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో గౌతమ్ అదానీ సోదరుడు చాట్ అమ్ముకుంటున్నాడంటూ పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ సోషల్ మీడియా జమానాలో ప్రతీది వింతే కదా జనాలకి.
ముఖ్యంగా ప్రముఖులు, సినిమా వాళ్లను పోలిన వాళ్లు కనిపిస్తే వారిని ఓవర్ నైట్ సోషల్ మీడియాలో వైరల్ చేసే చూస్తు్న్నారు. ఇది కూడా అదే బాపతి. ఇతకీ గౌతమ్ అదానీలా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరంటే..? ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్ వద్ద చాట్ అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి. ఇతనికీ గౌతమ్ అదానీకి ఎటువంటి సంబంధం లేదు. గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ అనే విషయం తెలిసిందే. ఎనర్జీ, లాజిస్టిక్స్, వ్యవసాయ వ్యాపారం, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, రక్షణ రంగం వంటి పరిశ్రమలలో ఆయన కంపెనీలు ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే అపర కుబేరుడిగా ఎదిగిన అదానీ గురించి తెలియని వాళ్లంటూ ఎవరూ లేరు. దాంతో ఆయనలా ఓ వ్యక్తి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
అయితే అదానీ విషయంలోనే కాదు గతంలో స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను పోలీ ఉన్న ఓ వ్యక్తి పాకిస్థాన్‌లో ఉండటం కూడా సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆన్‌లైన్‌లో కనిపించిన ఒక వీడియోలో ఎలాన్ మస్క్‌లా కనిపిస్తున్న ఓ వ్యక్తిని మరో వ్యక్తి సరదాగా ఎలాన్ మస్క్ అని పిలవడంతో అతను కూడా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు ఈ చాట్ వ్యాపారి కూడా సోషల్ మీడియా పుణ్యామా అని ఫేమస్ అయ్యాడు. ఇక రేపో మాపో ఏదో ఒక టీవీలో దర్శనమిచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Gautam Adani’s brother sells chaat near Andheri railway station, while Gautam is a billionaire. Yet, he gets no help from his brother. Sad.😢 pic.twitter.com/RR33GbMbsl
— Jeet Shah (@MostlyMomentum_) March 19, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.