Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైనర్ బాలికతో అలా చేయడం రేప్ కాదు.. దుమారం రేపుతోన్న అలహాబాద్ కోర్టు తీర్పు..

ఓ మైనర్‌ బాలికపై జరిగిన లైంగిక దాడి యత్నం... రేప్‌ అటెంప్ట్‌ కిందకు రాదంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ జడ్జిమెంట్‌ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు తీర్పుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

మైనర్ బాలికతో అలా చేయడం రేప్ కాదు.. దుమారం రేపుతోన్న అలహాబాద్ కోర్టు తీర్పు..
Court Verdict
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 21, 2025 | 9:18 AM

అటెంప్టివ్‌ రేప్‌ కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు, దేశంలో దుమారాన్ని రేపుతున్నాయి. అమ్మాయి ఎదను పట్టుకోవడం, పైజామా నాడాను లాగెయ్యడాన్ని అత్యాచార యత్నం కింద పరిగణించలేమని కోర్టు పేర్కొంది. దీన్ని పోక్సో చట్టం కింద… తీవ్ర లైంగికదాడిగా పరిగణించకూడదంటోంది కోర్టు. అత్యాచార యత్నంలో తొలి దశకు, అక్కడ వాస్తవంగా జరిగిన సంఘటనకు మధ్య తేడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడు అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అయితే నిందితులను తీవ్ర లైంగిక దాడి ఆరోపణల కింద విచారించాలని కోర్టు ఆదేశించింది.

2021 నాటికి చెందిన ఈ కేసులో 11 ఏళ్ల పాపపై పవన్‌, ఆకాష్‌ అనే వ్యక్తులు లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి, మైనర్‌ బాలికతో అభ్యంతరకరంగా నిందితులు వ్యవహరించారని, బలవంతంగా ఆమెను కల్వర్ట్‌ కిందకు లాగే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే స్థానికులు వచ్చి ఆ బాలికను కాపాడారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం, ఈ కేసును విచారించింది. దీన్ని అత్యాచార ప్రయత్నంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ చర్య వల్ల బాధితురాలు వివస్త్రగా మారలేదని కోర్టు అభిప్రాయపడింది.

ఈ తీర్పుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు మహిళా న్యాయవాదులు. బాలిక ఛాతీని పట్టుకోవడం లైంగికదాడి కాదా? పైజామా ఊడిపోయేలా నాడాలు తీయడం రేప్ అటెంప్ట్‌ కాదా? అంటూ వాళ్లు కొశ్చన్‌ చేస్తున్నారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే అవేవి రేప్‌ అటెంప్ట్‌ కిందకు రావంటోంది కోర్టు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై మొదలైన చర్చ, ఎటు దారితీస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!
మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!
60 ఏళ్ల వయసులో టాలీవుడ్ నటుడి రెండో పెళ్లి..
60 ఏళ్ల వయసులో టాలీవుడ్ నటుడి రెండో పెళ్లి..
సోమేశ్‌ ఆత్మహత్యలో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..
సోమేశ్‌ ఆత్మహత్యలో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..
మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?
మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!