Personality Test: పేరులోనే ఉంది మ్యాజిక్ అంతా.. చివరి అక్షరం మీరెలాంటి వారో చెప్పేస్తుంది..
అందరు మనుషులూ ఒకేలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండరు. కానీ ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి, మీరు వారితో సావాసం చేయాల్సిన అవసరం లేదు. వారి పేరు చాలు. కొత్తగా పుట్టిన శిశువుకు ఏ అక్షరం పెట్టాలో తెలుసుకోవడానికి మనం జాతకాన్ని పరిశీలిస్తాం.

మనం ఇతరులను పరిచయం చేసుకున్న మొదట్లోనే.. వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పలేం. ఒకట్రెండు మీటింగ్స్ తప్పనిసరి. అయితే మీకు ఇక్కడొకటి చెప్పాలి.. మీ పేరులోని చివరి అక్షరం మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుందని న్యూమరాలజిస్టులు అంటున్నారు. మరి మీ పేరులోని చివరి అక్షరం ఏం చెబుతుంది.? మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..
చివరి అక్షరం A అయితే:
A అక్షరంతో పేర్లు ముగిసే వ్యక్తులు చాలా ఎమోషనల్. మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలచే ఎక్కువగా ప్రభావితం అవ్వరు. అంతేకాదు, వీరు అంత తేలికగా ప్రేమలో పడరు. అలాగే వీరు తమ జీవిత భావస్వామిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఈ వ్యక్తులకు కుటుంబమే మొదటి ప్రాధాన్యత.
పేరు E అక్షరంతో ముగిస్తే:
పేరులోని చివరి అక్షరం E అయితే, ఈ వ్యక్తులు సౌమ్యులు, ఆశావాదులు. వీళ్లు వయసులో చిన్నవాళ్లే కానీ పరిణతి చెందిన తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా, ఆ మార్పులకు అనుగుణంగా వారు తమ జీవితాలను మార్చుకుంటారు. డ్రామాలు చేసే వారంటే.. వీరికి చిరాకు. వీరు ఇతరుల అభిప్రాయాలను, మాటలను పట్టించుకోరు. అంతేకాకుండా, ఇతరుల మాట వినకుండా స్వంతంగా ఎదుగుతారు.
పేరులోని చివరి అక్షరం L లేదా H అయితే:
ఈ వ్యక్తులు ఇతరుల పట్ల విశ్వాసంగా మెలుగుతారు. వీరు తమ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరు ఎవరినో సంతోషపెట్టడానికి జీవిచరు. అలాగే వీళ్లు ఎవరికైనా వాగ్దానం చేస్తే, దానిని నిలబెట్టుకునే వరకు వదిలిపెట్టరు. ఈ లక్షణాలే అతడికి ఇతరుల పట్ల గౌరవాన్ని తెచ్చిపెడతాయి.
O అక్షరంతో ముగిసే పేర్లు:
ఈ వ్యక్తులు చదువులో ఎల్లప్పుడూ ముందుంటారు. కొత్త ఆలోచనలతో ముందుకెళ్తుంటారు. క్రియేటివిటీకి పదునుపెడతారు. పరిస్థితి ఏదైనా కూడా ఈజీగా అవలంభిస్తారు.
పేరులోని చివరి అక్షరం N లేదా M అయితే:
వీరు విశాల దృక్పథంతో ఉంటారు. ఈ వ్యక్తులు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. వారు సమయానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు తమ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తారు.
పేరు R లేదా S అక్షరంతో ముగిస్తే:
పేరులోని చివరి అక్షరం R లేదా S అయితే ఈ వ్యక్తులు అందరికీ ఆదర్శప్రాయులు. ఈ వ్యక్తులు ఫ్యాషన్ ప్రియులు, దుస్తులకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వారు తమ పని పట్ల చాలా అంకితభావంతో ఉంటారు. వారి సహోద్యోగులు వీరి పనిని చూసి అసూయపడతారు.
పేరు Y లేదా T అక్షరంతో ముగిస్తే:
ఈ వ్యక్తులు ఎక్కువగా మాట్లాడతారు. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. అందువలన, వారు తమ మాటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వీరు ఇతరులలో తప్పులు ఈజీగా కనిపెడతారు. మోసగాళ్లను అంత తేలికగా క్షమించరు.