Optical illusion: మీకు మంచి IQ ఉంటె ఈ పజిల్‌ను పరిష్కరించండి చూద్దాం..!
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వినోదానికి, మెదడు వ్యాయామానికి అనేక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, పజిల్‌లు ఉన్నాయి. ఇవి కేవలం ఒక వినోద రూపంలో మాత్రమే కాకుండా.. మన కంటి చూపు, అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించేలా రూపొంది, మెదడుకు వ్యాయామం కూడా అందిస్తాయి. ఈ తరహా చిత్రాలను చూసే ప్రతీ వ్యక్తి దాగి ఉన్న వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తాడు. ఇవి ఒక రకమైన విజువల్ పజిల్‌లా ఉంటాయి.

మీరు చూస్తున్న ఇవాళ్టి ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లో 4 నెంబర్ల గల సంఖ్య దాగి ఉంది. మీరు కేవలం 5 సెకండ్లలో ఈ అంకెలను కనిపెట్టగలరా..? ఈ చిత్రాన్ని మీరు మొదట చూసినప్పుడు కావాల్సిన అంకెలు కాకుండా ఏవో అంకెలు మీకు కనిపిస్తుంటాయి. అయితే మీరు బాగా ఫోకస్ చేసి చూస్తే మాత్రం కనిపెట్టగలరు.
ఈ పజిల్ కి మీకు కేవలం 5 సెకండ్ల సమయం మాత్రమే ఇవ్వబడుతుంది. ఆ 5 సెకండ్లలో మీరు దాగిన సంఖ్యలను గుర్తించగలిగితే మీ విజువల్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎంత బలంగా ఉన్నాయో చూపిస్తుంది. మీరు ఆ సమయానికి ముందుగానే సులభంగా అంకెలను కనుగొనకపోతే మళ్లీ ప్రయత్నించాల్సి ఉంటుంది. దీనిని ఒక ఆటగా భావించండి. ప్రతి ప్రయత్నంలో మీ మెదడు మరింత శక్తివంతంగా పనిచేస్తుంది.
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కేవలం ఆన్ లైన్ లో వినోదానికి మాత్రమే కాకుండా కళ్లకు, మెదడుకు వ్యాయామంలా పనిచేస్తాయి. అందుకే ఈ పజిల్‌లను ఆసక్తిగా పరిచయం చేసుకుంటూ ప్రజలు వీటిని ఆస్వాదిస్తున్నారు. ఈ ఆటను ఆడేటప్పుడు మన మెదడు చురుకుగా పని చేస్తుంది. ముఖ్యంగా మనసు కుంగిపోయినవారు లేదా ఏదైనా ఆలోచనలో చిక్కుకున్నవారు ఇలాంటి ఆటలు ఆడితే వారి గందరగోళం తగ్గి స్పష్టమైన ఆలోచన రావడానికి సహాయపడుతుంది.
మీరు ఇచ్చిన సమయంలో ఆ అంకెలను కనిపెట్టారని అనుకుంటున్నాం. ఇంకా కనిపెట్టని వారు వెతుకుతూ ఉంటే.. మరొకసారి ప్రయత్నించండి. అయినా కనిపెట్టలేకపోతే చింతించకండి. మీ కోసం నేను వెతికిపెట్టాను ఆ సంఖ్య 3246.