Vidhya Veerappan: వీరప్పన్ కుమార్తెకు ఆ పార్టీలో కీలక పదవి..! అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ?
వీరప్పన్ కుమార్తె విద్యారాణి తన రాజకీయ జీవితంలో మరో మలుపు తిరిగింది. తొలుత పీఎంకే, తరువాత బీజేపీ, ఇప్పుడు నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే)లో కీలక పదవిని ఆమె అలంకరించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, ఎన్టీకే యూత్ బ్రిగేడ్ రాష్ట్ర కన్వీనర్‌గా ఆమె నియామకం జరిగింది.

మూడు రాష్ట్రాల(ఏపీ, తమిళనాడు, కర్ణాటక) పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయనపై సినిమా కూడా వచ్చింది. ఇప్పటికీ వీరప్పన్ నేర చరిత్ర గురించి కొన్ని ప్రాంతాల్లో కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఆమె కుమార్తె విద్యారాణి వీరప్పన్ రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. గతంతో బీజేపీలో చేరి పలు పదవుల్లో పని చేశారు. ఆ తర్వాత లోక్‌సభకు కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా ఆమెకు కీలక పదవి దక్కింది.
విద్యారాణి తొలుత పీఎంకేలో పనిచేశారు. ఆ తర్వాత 2020లో ఆమె బీజేపీలో చేరారు. ఆ సయమంలో బీజేపీ ఓబీసీ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2024లో బీజేపీకి రాజీనామా చేసి నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే)లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కృష్ణగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఆమెను పార్టీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర కన్వీనర్లలో ఒకరిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ ప్రకటించారు.
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యావాణికి కీలక పదవిని అప్పగించడం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విద్యావాణి ఎన్నికల బరిలో నిలుస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారన్న అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..