Video: హిందీపై కర్ణాటకలోనూ అంటుకున్న చిచ్చు! ఓ హోటల్ యజమాని ఏం చేశాడో చూడండి..
కర్ణాటకలోని ఒక హోటల్ ముందు హిందీని అధికారిక భాషగా ప్రదర్శించిన డిజిటల్ బోర్డు తీవ్ర వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోతో పోలీసులు జోక్యం చేసుకుని బోర్డును తొలగించారు. తమిళనాడులో హిందీ విధానంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ ఘటన మరింత చర్చకు దారితీసింది. పాత మేనేజర్ ఈ కార్యక్రమానికి కారణమని దర్యాప్తులో తేలింది.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతోందని తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవలె జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటంతో మరింత రచ్చ రాజుకుంది. అయితే హిందీపై జరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు కర్ణాటకలోనూ అంటుకుంది. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కర్ణాటకలో ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన హోటల్ ముందు ఓ పెద్ద డిజిటల్ బోర్డుపై హిందీ అధికారిక భాష అని డిస్‌ప్లే చేశాడు.
దీంతో ఆ బోర్డును ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ హోటల్ యజమానిపై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. విద్యారణ్యపురలోని ఎంఎస్ పాల్య సర్కిల్‌లోని గురు దర్శన్ కేఫ్ వద్ద ఈ డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్రమత్తమైన పోలీసులు డిజిటల్ బోర్డుపై ఉన్న రాతను తొలగించారు. భవన యజమానిని పిలిపించి దీనిపై ప్రశ్నించారు. దర్యాప్తులో, పాత మేనేజర్ ఈ పని చేశాడని తేలడంతో అతన్ని వదిలేశారు.
Peak Bengaluru Moment: Vidyaranyapura Cafe Sparks Language Debate with ‘Hindi is Official Language’ Board In the midst of ongoing language tensions between Kannada and Hindi in Bengaluru, a new controversy has emerged in Vidyaranyapura. A local eatery, Sri Guru Darshan Cafe, has… pic.twitter.com/Xe3pQ5r7Ba
— Karnataka Portfolio (@karnatakaportf) March 20, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.