Modi Government: న్యూ ఇయర్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రజలందరూ ఈ పని చేస్తే బెనిఫిట్
కొత్త సంవత్సరం వేళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రకటన ఒకటి చేసింది. సొంత వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారందరికీ అలర్ట్ జారీ చేసింది. ప్రతీఒక్కరూ కొత్త ఏడాదిలో ఈ పని తప్పనిసరిగా చేయాలని సూచించింది. ఇంతకు అదేంటో ఇప్పుడు చూద్దాం.

ఇప్పట్లో ఏవైనా డిజిటల్ సేవలు పొందేందుకు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది తప్పనిసరి. ఆధార్, పాన్ లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల అనేక సేవలు సులువుగా పొందోచ్చు. అందులో భాగంగా బైక్,కారు లాంటి వెహికల్స్ కలిగి ఉన్నవారు కూడా మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. వెహికల్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్స్ రెన్యూవల్ చేసుకోవడం, ఓనర్ షిఫ్ ట్రాన్స్‌పర్ చేసుకోవడం, డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్స్, పర్మిట్ లాంటి డిజిటల్ సేవలు పొందేందుకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం అనేది అవసరం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న వాహన యాజమానులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది.
కేంద్రం కీలక ఆదేశాలు
పరివాహన్ లేదా సారధి యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్స్ కలిగి ఉన్నవారు మొబైల్ నెంబర్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. పాత నెంబర్ ఉండి ఉంటే ఇప్పుడు కొత్తది పొందుపర్చాలని తెలిపింది. ఆన్ లైన్ రవాణా సేవలను ఎటువంటి సమస్యలు లేకుండా పొందటానికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. పాత మొబైల్ నెంబర్ ఉండటం వల్ల ఆన్‌లైన్‌లో రవాణా సేవలు పొందేందుకు ఓటీపీ ధృవీకరణ చేసుకోలేరని తెలిపింది. చాలామంది ఇప్పటికీ సంవత్సరం క్రితం రిజిస్టర్ చేసిన మొబైల్ నెంరబ్లను ఉపయోగిస్తున్నారంది. భవిష్యత్తులో రవాణా సేవలను ఆన్ లైన్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సలభంగా పొందేందుకు కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే..?
-vahan.parivahan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి -మొబైల్ నెంబర్ అప్డేట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి -వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఛాసిస్ నెంబర్ చివరి ఐదు అంకెలు ఇవ్వండి -కొత్త మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి -ఓటీపీ ఎంటర్ చేసి ధృవీకరించండి
డ్రైవింగ్ లైసెన్స్ కోసం
-sarathi.parivahan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి -స్టేట్‌ను ఎంచుకోండి -డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇతర వివరాలను ఎంటర్ చేయండి -కొత్త మొబైల్ నెంబర్ నమోదు చేయండి -ఓటీపీని ధృవీకరించి రసీదును డౌన్ లోడ్ చేసుకోండి
