Indian Defense Exports: ఆయుధాల ఎగుమతులలో భారత్ అరుదైన రికార్డు.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ అసక్తికర వివరాల వెల్లడి
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమలుచేస్తున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ స్వావలంబన చొరవను స్వీకరించినప్పటి నుంచి దేశం అనేక విజయాలను సాధించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. శుక్రవారం ‘అజెండా ఆజ్తక్..
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమలుచేస్తున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ స్వావలంబన చొరవను స్వీకరించినప్పటి నుంచి దేశం అనేక విజయాలను సాధించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. శుక్రవారం ‘అజెండా ఆజ్తక్ కాన్క్లేవ్ 2022’లో పాల్గొన్న ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ‘‘ ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి స్వేదేశీ విమాన విహక నౌకలను తాయారుచేసుకోవడం ద్వారా మన దేశం కూడా అగ్రరాజ్యాల సరసకు చేరింది. ‘మేక్ ఇన్ ఇండియా’ నుంచి ‘మేక్ ఫర్ ది వరల్డ్’ అనే స్థాయికి భారత్ చేరింది. ఇందులో భాగంగా పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తూనే, వారితో పాటు దేశాభివృద్ధికి ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింద’’ని ఆయన అన్నారు.
‘‘రక్షణ ఎగుమతుల విషయంలో భారత్ 2014లో రూ. 900 కోట్లతో ఉండగా ఇప్పుడు రూ. 14,000 కోట్లకు చేరుకున్నాయి. 2023 నాటికి రక్షణ ఎగుమతులు రూ. 19,000 కోట్లను దాటగలవని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము బాగానే ప్రయత్నిస్తున్నామ’’ని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. 2025 నాటికి రూ.25,000 కోట్ల విలువైన ఎగుమతులు జరగనున్నాయని ఆయన తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా 22,500 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగా’ గురించి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు.
కాగా రష్యా, ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులతో ప్రధానిమోదీ మాట్లాడిన తర్వాతే ఇది సాధ్యమైందని అన్నారు. గ్లోబల్ లీడర్‌గా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీకి ఉన్న విశ్వసనీయత, ఆమోదానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 8 సంవత్సరాలలో 3.5 ట్రిలియన్ డాలర్ల జిడిపితో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘2014కి ముందు మోర్గాన్ స్టాన్లీ అనే పెట్టుబడి సంస్థ రూపొందించిన ‘ఫ్రాగిల్ ఫైవ్’ దేశాలలో భారతదేశం ఉంది. ఈ రోజు మనం ఆ జాబితా నుంచి ప్రపంచంలోని ‘ఫ్యాబులస్ ఫైవ్’ ఆర్థిక వ్యవస్థలలో చేరాము’’ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..