Lightening Strikes: ప్రకృతి బీభత్సం..పిడుగులు పడి మూడు రాష్ట్రాల్లో 68 మంది మృతి..పలువురికి గాయాలు
ప్రకృతి కన్నెర్ర చేసింది. పిడుగులు పడి మూడు రాష్ట్రాల్లో కేవలం రెండు రోజుల్లో 68 మంది మరణించారు. యూపీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ బీభత్సం సంభవించింది. యూపీలో మృతుల సంఖ్య 41 కి పెరగగా..రాజస్థాన్ లో 20 మంది, మధ్యప్రదేశ్ లో ఏడుగురు మృతి చెందారు.
ప్రకృతి కన్నెర్ర చేసింది. పిడుగులు పడి మూడు రాష్ట్రాల్లో కేవలం రెండు రోజుల్లో 68 మంది మరణించారు. యూపీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ బీభత్సం సంభవించింది. యూపీలో మృతుల సంఖ్య 41 కి పెరగగా..రాజస్థాన్ లో 20 మంది, మధ్యప్రదేశ్ లో ఏడుగురు మృతి చెందారు. రాజస్థాన్ లో మృతి చెందినవారిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు. కోటా, ధోల్ పూర్ జిల్లాల్లో అమాయక బాలలు మరణించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే రాష్ట్రంలో మరో 10 మంది గాయపడ్డారు. యూపీ లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో జరిగిన వేర్వేరు సంఘటనల్లో 14 మంది, కాన్పూర్ దోహట్, ఫతేపూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున, కుశాంబీ, హామీర్ పూర్, సొన్ భద్ర, కాన్పూర్ నగర్, మీర్జాపూర్ తదితర జిల్లాల్లో ఎక్కువగా మరణాలు సంభవించాయి. మొదట రాజస్థాన్ లో 20 మంది మృతి చెందినట్టు తెలియగానే ప్రధాని మోదీ ..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రాజస్థాన్ లో మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. జైపూర్ లోని అమీర్ ఏరియాలో కేవలం 40 నిముషాల సమయంలో వాచ్ టవర్ పై నిన్న రెండు సార్లు పిడుగులు పడడంతో 11 మంది మృత్యు వాత పడ్డారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, శివపురి, అనుప్పుర్, బేతుల్ జిల్లాల్లోనూ మరణాలు సంభవించాయి. ఇలా ప్రకృతి వైపరీత్యాల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద వెంటనే పరిహారం అందాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి : మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021