దారుణం.. ఐదేళ్ల చిన్నారపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి హత్య
దేశంలో పెరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఆడవాళ్లు అత్యాచారానికి బలవుతున్నారు. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు కూడా ఇలాంటి దారుణాలు జరుగుతునే ఉన్నాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించినా కూడా అమ్మాయిలపై దాడులు, అత్యాచారాలు ఆగడం లేదు.
దేశంలో పెరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఆడవాళ్లు అత్యాచారానికి బలవుతున్నారు. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు కూడా ఇలాంటి దారుణాలు జరుగుతునే ఉన్నాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించినా కూడా అమ్మాయిలపై దాడులు, అత్యాచారాలు ఆగడం లేదు. మరికొన్ని చోట్ల సామూహిక అత్యాచారాలు కూడా జరగడం దేశంలోని ఆడవారి భద్రతకు అద్దం పడుతోంది. అయితే తాజాగా కేరళలో ఓ దారణం జరిగింది. కేవలం 5 సంవత్సరాల వయసున్న ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కొచ్చిన్‌లోని అలువా అనే ప్రాంతంలో బీహార్ నుంచి వలస కూలీలు ఉంటున్నారు. ఆ ప్రాంతంలోనే పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
అయితే ఆ వలస కూలీల దంపతులకు చెందిన కుమార్తెను మరో వలస కూలీయే శుక్రవారం రోజున కిడ్నాప్ చేశాడు. ఆ రోజు కూతురి కోసం తల్లిదండ్రులు అన్నిచోట్ల వెతికారు. ఎక్కడా కూడా ఆ చిన్నారి ఆచూకి కనిపించలేదు. దీంతో చివరికి శుక్రవారం రాత్రి 7.00 PM గంటలకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో దొరికిన ఆధారాల ద్వారా నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే ఆ నిందితుడు మద్యం తాగి అపస్మారక స్థితిలో ఉండటం వల్ల ఎలాంటి వివరాలు చెప్పలేదు. ఆ చిన్నారి కూడా అతని వద్ద కనిపించలేదు. శనివారం ఉదయం ఆ నిందితుడు స్పృహాలోకి వచ్చాడు. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆ చిన్నారిని చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. స్థానిక మార్కెట్ సమీపంలో ఉన్న ఓ డంపింగ్ యార్డులో పారేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించారు. ఆ రిపోర్టులో ఆ చిన్నారిని అత్యాచారం చేసి గొంతు నులుమి చంపినట్లు తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.