AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: అమేజింగ్.. స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. మీ సమస్యలన్నీ..

అతిగా ఆలోచిస్తున్నారా.. ఒత్తిడి, నొప్పులతో బాధపడుతున్నారా.. నేటి ఫాస్ట్ లైఫ్‌లో ఇవి కామన్ సమస్యలు. అయితే దీనికి ఖరీదైన చికిత్సలు అవసరం లేదు. మీ కిచెన్‌లో ఉండే ఒక చిన్న వస్తువుతో ఈ సమస్యలకు సులభంగా, శక్తివంతంగా చెక్ పెట్టవచ్చు. ఇది శరీరాన్ని, మనసును రిలాక్స్ చేయడంతో పాటు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.

Health Tips: అమేజింగ్.. స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. మీ సమస్యలన్నీ..
Salt Bath Health Benefits
Krishna S
|

Updated on: Oct 12, 2025 | 4:55 PM

Share

వేగవంతమైన నేటి జీవనశైలిలో ఒత్తిడి, అలసట, శరీర నొప్పులు సర్వసాధారణమైపోయాయి. వీటితో పాటు అతిగా ఆలోచించడం, ఆందోళన, ప్రతికూలత వంటి మానసిక సమస్యలు కూడా తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. దీనికి ఎన్నో ఖరీదైన చికిత్సలు ఉన్నా కేవలం ఒక్క వస్తువుతో చాలా సులభంగా చేయగలిగే ఒక శక్తివంతమైన పరిష్కారం ఉంది. అదే.. ఉప్పు నీటితో స్నానం చేయడం. అవును ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రుచి మాత్రమే కాదు.. సమతుల్యతకు చిహ్నం

సాధారణంగా ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. కానీ ఇది కేవలం కిచెన్ వస్తువు కాదు. వాస్తు, జ్యోతిషశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉప్పును సమతుల్యత, సానుకూలతకు చిహ్నంగా భావిస్తారు. ఇది పాజిటివ్, నెగెటివ్ శక్తులను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

శరీరం, మనసుకు అద్భుత ఔషధం

సముద్రపు ఉప్పు లేదా గులాబీ ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల అనేక శారీరక, మానసిక ఉపశమనాలు లభిస్తాయి.

ఒత్తిడి తగ్గింపు: వేడి ఉప్పు నీటితో స్నానం ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. ఇది మనసుకు ప్రశాంతతనిచ్చి, మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. పడుకునే ముందు ఈ స్నానం చేస్తే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.

కండరాల నొప్పికి చెక్: రోజువారీ పని, ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే కండరాల దృఢత్వం, నొప్పిని తగ్గించడంలో ఉప్పు నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచి, అలసిపోయిన కాళ్లకు విశ్రాంతినిస్తుంది.

సైన్స్ – ఆధ్యాత్మికత ప్రకారం ఉప్పు ప్రయోజనాలు

ప్రతికూల శక్తి తొలగింపు: ఉప్పుకు సహజ శుభ్రపరిచే లక్షణాలు ఉంటాయి. ఇది శరీరం చుట్టూ ఉన్న ఆరా నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.

మానసిక ప్రశాంతత: వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉప్పు నీటి స్నానం చేయడం ద్వారా ఒత్తిడి, విచారం తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

ఆరా సానుకూలత: ఉప్పు నీటి స్నానం చేయడం వల్ల ఆరా బలపడి, ప్రతికూలత తొలగుతుంది. దీనివల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని నమ్ముతారు.

సముద్రపు ఉప్పు ప్రత్యేకత

సాధారణ టేబుల్ ఉప్పు కంటే సముద్రపు ఉప్పు మందంగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఖనిజాలు చర్మం, కండరాలు, కీళ్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఎలా చేయాలి?

ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో లేదా టబ్‌లో ఒక చిన్న గిన్నె ఉప్పు వేసి కరిగించండి. ఆ నీటితో స్నానం చేయండి. ఉప్పు వెంటనే కరిగిపోవడం వలన ఎక్కువ సమయం పట్టదు. ఈ పద్ధతి వేగంగా పనిచేస్తుంది.

ఇది గుర్తుంచుకోండి

మీ చర్మంపై బహిరంగ గాయాలు, ఇన్ఫెక్షన్లు లేదా ఉప్పుకు అలెర్జీ ఉంటే దయచేసి ఉప్పుతో స్నానం చేయకుండా ఉండండి. ఇది గాయాలను చికాకు పెట్టవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?