- Telugu News Photo Gallery Drink these five super drinks every morning to stay active throughout the day
Health Tips: మీ డేను యాక్టీవ్‌గా ఉంచే సూపర్ డ్రింక్స్.. రోజూ ఉదయం తాగితే.. ఛేంజ్ మీకే తెలుస్తోంది
మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు వేడి కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. వీటి వల్ల ప్రయోజనాలు ఉంటాయని చాలా మంది అనుకుంటారు కానీ ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, ఉదయం లేవగానే మీరు ముందుగా ఏమి తాగాలి? వేటిని తాగితే మీరు రోజంతా యాక్టీవ్ ఉంటారో తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మీరు రోజంతా యాక్టీవ్‌గా ఉండేందుకు తాగాల్సిన ఐదు సూపర్ డ్రింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Oct 12, 2025 | 4:17 PM

దీంతో బరువు తగ్గడానికి రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.

జీలకర్ర నీరు: ఒక చెంచా జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని మరిగించి, వడకట్టి త్రాగాలి. ఈ నీరు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. అలాగే పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. దానితో పాటు కడుపును చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది

గూస్బెర్రీ జ్యూస్: గూస్బెర్రీని "సూపర్ ఫుడ్" అంటారు. ఇందులో విటమిన్ సి, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపులో ఆమ్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అలాగే పేగు పొరను రక్షిస్తుంది. ప్రతి ఉదయం కొద్దిగా గూస్బెర్రీ రసం తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

కలబంద రసం: కలబంద మన చర్మానికే కాదు, మన కడుపునకు కూడా ఎంతో మంచింది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇవి పేగులకు కూలింగ్ ప్యాడ్ లాగా పనిచేస్తాయి. మలబద్ధకం, IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) వంటి సమస్యలతో బాధపడేవారికి కలబంద రసం గొప్ప పరిష్కారంగా ఉంటుంది.

ఇసాబ్గోల్ తో వేడి నీరు: ఇసాబ్గోల్ అనేది ఒక రకమైన ఫైబర్. దీన్ని ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఇది ప్రేగులలోని సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

అయితే, పైన పేర్కొన్న ఈ ఐదు పానీయాలు మన శరీరాలను హైడ్రేట్ చేయడమే కాకుండా, ప్రేగులను శుభ్రపరుస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది వేస్తాయి. మీరు ఈ చిన్న మార్పు ప్రయత్నిస్తే మీ జీర్ణవ్యవస్థ ఖచ్చితంగా మంచిగా ఉంచుకోవచ్చు.( NOTE పైన పేర్కొన్న అంశాలు నిపుణులు, లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన అంశాల వివరాల ఆధారంగా ఇవ్వబడినవి వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి )




