- Telugu News Photo Gallery Flipkart Diwali Sale: Huge Discounts on Samsung S24 5G, Poco F7 and More Smartphones
Flipkart Diwali Sale: బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. రూ.33వేల ఫోన్ రూ.17వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డిస్కౌంట్స్..
పండుగ సీజన్ షురూ అయింది.. దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వివిధ బ్రాండ్‌ల ప్రీమియం, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ద్వారా కళ్లు చెదిరే డిస్కౌంట్‌లను అందిస్తుంది. ఇందులో శామ్‌సంగ్, మోటోరొలా, పోకో, సీఎంఎఫ్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ఫోన్‌లు భారీ తగ్గింపులతో లభిస్తున్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు.
Updated on: Oct 12, 2025 | 3:23 PM

ఈ సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో కొన్ని మిడ్-రేంజ్ బడ్జెట్ ఫోన్‌లపై లభిస్తున్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ 6.6 ఇంచెస్ అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.33,999. కానీ దీపావళి సేల్‌లో కేవలం రూ.17,999కే లభిస్తోంది.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఫోన్ 6.67ఇంచెస్ pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 7400 5G ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్/మాక్రో సెన్సార్ ఉన్నాయి.ఈ ఫోన్ అసలు ధర రూ.25,999 నుంచి 20,999కి తగ్గింది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 5G : ఫుల్ HD+ డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 8GB RAM - 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రీమియం ఫోన్ 50MP + 12MP బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇప్పుడిది ఏకంగా 46శాతం తగ్గింపుతో కేవలం రూ.39,999 కే అందుబాటులో ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE 5G: 6.7-ఇంచెస్ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్న ఈ ఫోన్ Exynos 2400e ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, IP68 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్న ఈ మోడల్ 48శాతం తగ్గింపుతో సేల్‌లో అందుబాటులో ఉంది. దీనిని రూ.30,999కే మీ సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎఫ్7 5G: స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో అత్యంత శక్తివంతమైన ఈ ఫోన్ 7550mAh బ్యాటరీతో వస్తుంది. అసలు ధర రూ.35,999 కాగా ఈ సేల్‌లో రూ.30,999కే అందుబాటులో ఉంది.

నథింగ్ ఫోన్ 2 ప్రో: డైమెన్సిటీ 7300 Pro 5G ప్రాసెసర్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, 50MP + 50MP ట్రిపుల్ కెమెరాతో పాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ మోడల్ అసలు ధర రూ.24,999 కాగా సేల్ ధర రూ.16,999గా ఉంది.




