AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్ లెవెల్స్‌‌ను కంట్రోల్ చేసే జ్యూస్‌లివే.. తాగితే మధుమేహం ఉన్నట్లు కూడా తెలియదు..!

డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని రకాల రసాలను తాగితే చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం కాకరకాయ రసం వంటి ఆయుర్వేదం కాషయంతో పాటు అనేక రకాల..

Diabetes: షుగర్ లెవెల్స్‌‌ను కంట్రోల్ చేసే జ్యూస్‌లివే.. తాగితే మధుమేహం ఉన్నట్లు కూడా తెలియదు..!
Diabetes symptoms
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 01, 2023 | 11:29 AM

Share

ఉరుకులు పరుగుల మానవ జీవితంలో చాలా మంది శరీరానికి సరిపడని ఆహారపు అలవాట్లను అనుసరిస్తున్నారు. అంటే సమయానికి తినకపోవడం లేదా ఎక్కువగా జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తినడం వంటివి. వీటి కారణంగానే నేటి కాలంలో చిన్న పిల్లలు కూడా మధుమేహం(Diabetes) వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ఒక్కసారి ఈ వ్యాధి సోకితే జీవితాంతం వదలనే వదలదు. ఇంకా ఎన్నో రకాల ఆహారపు నియమాలను కూడా తుచా పాటించాలి, ఏది పడితే అది తింటే ఆ రోజు ఆరోగ్యం దిగజారినట్లే. అందువల్ల కుదిరితే మధుమేహం సమస్య రాకముందే జాగ్రత్త పడడం లేదా వచ్చినవారు షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రణలో పెట్టుకోవడం మంచిది. లేకపోతే శరీరంలోని షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఆహ్వానించినట్లే అవుతుంది.

అటువంటి పరిస్థితిలో.. డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని రకాల రసాలను తాగితే చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం కాకరకాయ రసం వంటి ఆయుర్వేదం కాషయంతో పాటు అనేక రకాల ఇతర జ్యూస్‌లు కూడా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులు షుగర్ లెవెల్స్‌ని నియంత్రించవచ్చు. మరి అందుకు ఉపయోగపడే జ్యూస్‌లేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహుల షుగర్ లెవెల్స్‌ను నియంత్రించే జ్యూస్‌లివే..

కాకరకాయ రసం: కాకరకాయ రసం మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకరలో యాంటీ‌డయాబెటిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కాకర జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు రోజూ కాకర జ్యూస్ తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

పాలకూర రసం: మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పాలకూర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ బి, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. పాలకూర రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

సొరకాయ రసం: సొరకాయ రసం మధుమేహ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సొరకాయ రసం తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది. మీరు బరువు పెరుగుటతో పాటు అధిక రక్త చక్కెరతో బాధపడుతున్నట్లయితే, సీసా సొరకాయ రసం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఉసిరి రసం: ఉసిరి రసం మధుమేహ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రసం చేయడానికి, రెండు చెంచాల ఉసిరి రసాన్ని తీసి, దానికి చిటికెడు పసుపు పొడిని కలపండి. దీని తరువాత మీరు ప్రతి ఉదయం- సాయంత్రం ఈ మిశ్రమాన్ని త్రాగవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా ఆరోగ్య పరమైన సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…