Diabetes: ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే షుగర్ వ్యాధి రమ్మన్నా రాదు!
ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి అనేది చాలా కామన్ అయిపోయింది. షుగర్ రావడం జ్వరం రావడం లాంటిది అనుకుంటున్నారు. కానీ వచ్చాక ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. జీవితాంతం మందులు వేసుకుంటూనే ఉండాలి. ఏ ఆహారం కూడా సరిగ్గా తినడానికి ఉండదు. మీ డైట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే.. ప్రాణాల మీదకే వస్తుంది. డయాబెటీస్ అనేది ఆకస్మికంగా వచ్చే జబ్బు..

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి అనేది చాలా కామన్ అయిపోయింది. షుగర్ రావడం జ్వరం రావడం లాంటిది అనుకుంటున్నారు. కానీ వచ్చాక ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. జీవితాంతం మందులు వేసుకుంటూనే ఉండాలి. ఏ ఆహారం కూడా సరిగ్గా తినడానికి ఉండదు. మీ డైట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే.. ప్రాణాల మీదకే వస్తుంది. డయాబెటీస్ అనేది ఆకస్మికంగా వచ్చే జబ్బు ఏమీ కాదు. మీకు ఉన్న చెడు ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల మధుమేహం అనేది వస్తుంది. షుగర్ వ్యాధి లక్షణాలు మీలో కనిపించిన వెంటనే మీరు వైద్యుల్ని సంప్రదించడం మంచిది. అలా అయితే అదుపులో ఉంటుంది. మీ లైఫ్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. అయితే ఈ డయాబెటీస్ అనేది ముందుగా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
డయాబెటీస్ లక్షణాలు ఇవే:
ఆకలి ఎక్కువగా ఉండటం, మూత్ర సమస్యలు, నీరసంగా, అలసటగా ఉండటం, దాహం మరీ ఎక్కువగా వేయడం, ఎంత తిన్నా ఆకలిగా అనిపించడం, కాళ్లు, చేతులు లాగడం, దెబ్బలు ఒక చోట తగిలినా త్వరగా తగ్గకపోవడం వంటి సమస్యలు మధుమేహం కిందకు వస్తాయి.
బరువును అదుపులో ఉంచుకోండి:
డయాబెటీస్ రావడానికి బరువు కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్, రక్తంలో షుగర్ లెవల్స్ బాగా పెరుగు పోతాయి. అలాగే ఎక్కువగా జంగ్ ఫుడ్ తినాలి అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ బరువును అదుపులో ఉంచుకోండి.
నిద్ర:
నిద్ర సరిగ్గా లేకపోయినా షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న కాలంలో చాలా మంది రాత్రుళ్లు త్వరగా పడుకోవడం లేదు. ఫోన్లు, టీవీలు చూస్తూ అర్థరాత్రి దాటాక పడుకుంటున్నారు. రాత్రి 9 లేదా 10 గంటల లోపు ఎవరైతే ప్రశాంతంగా పడుకుంటారో వారికి డయాబెటీస్ వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అదే విధంగా ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుకోవాలి.
జంక్ ఫుడ్:
జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ అనేది వచ్చే ఛాన్సులు 90 శాతం ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా కొవ్వులు, చక్కెరలు, నూనె ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








