AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం, చపాతీ కంటే ఈ ఫుడ్ మహిళలకు ఓ వరం.. బరువు తగ్గాలంటే దీనిని ట్రై చేయండి

ఒక కప్పు సగ్గుబియ్యంలో 544 కేలరీలు, 135 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్, ప్రొటీన్లు కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తాయి. ఫైబర్ జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. కనుక సగ్గుబియ్యం తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గుతారు. మధ్యాహ్నం చపాతీలు లేదా అన్నం తినడం మానేసి సగ్గుబియ్యం కిచిడీని తినవచ్చు. వీటిల్లో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి కనుక వీటిని తీసుకోవడం వల్ల పని చేసే సామర్థ్యం కూడా వస్తుంది.

అన్నం, చపాతీ కంటే ఈ ఫుడ్ మహిళలకు ఓ వరం.. బరువు తగ్గాలంటే దీనిని ట్రై చేయండి
Sabudana
Surya Kala
|

Updated on: Jun 20, 2024 | 5:23 PM

Share

తెల్లటి ముత్యాల మాదిరిగా మెరిస్తూ కనిపించే సగ్గుబియ్యంలో అనేక ఆరోగ్య పోషకాలున్నాయి. అయితే వీటికి సొంత రుచి లేకపోవడంతో వివిధ రకరకాల ఆహార పదార్ధాలతో కలిపి తింటారు. అంటే.. పండ్లు, మసాలాలు, కిచిడి ఇలా తయారు చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ముఖ్యంగా ఉపవాసం విరమించిన తర్వాత సగ్గు బియ్యంతో చేసిన ఆహారాన్ని తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే అప్పుడప్పుడు తినే సగ్గుబియ్యం తో చేసిన ఆహారాన్ని రోజూ గంజి రూపంలో తీసుకోవడం బెస్ట్ అని అంటున్నారు. సగ్గుబియ్యంలో ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటే సగ్గు బియ్యం సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఒక కప్పు సగ్గుబియ్యంలో 544 కేలరీలు, 135 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ ఆహారాలలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం , మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఉండదు. అదనంగా శరీరంలో పని చేసేందుకు తక్షణ శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ఆహారం బరువును తగ్గిస్తుంది.

వీటిలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్, ప్రొటీన్లు కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తాయి. ఫైబర్ జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. కనుక సగ్గుబియ్యం తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గుతారు. మధ్యాహ్నం చపాతీలు లేదా అన్నం తినడం మానేసి సగ్గుబియ్యం కిచిడీని తినవచ్చు. వీటిల్లో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి కనుక వీటిని తీసుకోవడం వల్ల పని చేసే సామర్థ్యం కూడా వస్తుంది. అలసట, బలహీనతతో ఉన్న సమయంలో ఇబ్బంది పడకుండా సగ్గుబియ్యం తో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి అని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ రోజుల్లో చాలా మంది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కోసం చూస్తున్నారు. గ్లూటెన్ రహిత ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా మధుమేహం, కొలెస్ట్రాల్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు. ఈ సందర్భంలో సగ్గుబియ్యన్ని ఎంచుకోవచ్చు. వీటిని తినడం వల్ల శరీరంలో గ్లూటెన్ చేరే అవకాశం ఉండదు.

గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైన ఆహారం సగ్గుబియ్యం. ఈ ఆహారాలలో ఫోలేట్ ఉంటుంది. ఈ పోషకం గర్భధారణ సమయంలో రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది, పిండం పెరుగుదల, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డెలివరీ తర్వాత కూడా మీరు వీటిని తీసుకోవచ్చు. ఇది తల్లి పాలను కూడా పెంచుతుంది. అంతే కాదు ఇవి ఋతుస్రావం సమయంలో వివిధ శారీరక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగకరమైన సగ్గుబియ్యాన్ని సరైన శరీర బరువును మెయింటైన్ చేయాలన్నా, రక్తహీనత తగ్గాలన్నా తినే ఆహారంలో చేర్చుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us