AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Stroke: హీట్‌వేవ్‌తో మెదడు దెబ్బతిని తెలియకుండానే మరణం.. డాక్టర్ సలహా ఏమిటంటే..

ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగినప్పుడు మెదడు చుట్టూ ఉండే రక్షణ పొర దెబ్బతినడం మొదలవుతుందని ఢిల్లీలోని న్యూరోసర్జన్ డాక్టర్ మనీష్ కుమార్ చెబుతున్నారు. అప్పుడు మెదడులో మరింత ప్రోటీన్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మెదడు కణాలు చనిపోతాయి. అప్పుడు ప్రాణాంతకం కావచ్చని చెప్పారు. చాలా సందర్భాలలో తీవ్రమైన వేడి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది.

Brain Stroke: హీట్‌వేవ్‌తో మెదడు దెబ్బతిని తెలియకుండానే మరణం.. డాక్టర్ సలహా ఏమిటంటే..
Heatwave And HeatstrokeImage Credit source: Sunil Ghosh/HT via Getty Images
Surya Kala
|

Updated on: Jun 20, 2024 | 3:34 PM

Share

భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో విపరీతమైన వేడి విధ్వంసం సృష్టిస్తుంది. గడచిన 24 గంటల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా అనేక మంది చనిపోయారు. రోగులు ఆసుపత్రికి చేరుకునేలోపే మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వేడి కారణంగా ప్రజలు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. కొంత మంది మరణానికి కూడా ఎండల వేడి, వడగాల్పులకు దారి తీస్తున్నాయి. అదే సమయంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత మెదడుపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల మెదడు దెబ్బతింటోంది. మెదడును ప్రభావితం చేసే వేడి ప్రక్రియ చాలా త్వరగా జరుగుతుంది.. అయితే అది గుర్తించబడదు. వేడి కారణంగా వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మరణిస్తాడు.

ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగినప్పుడు మెదడు దెబ్బతింటుందని షెల్బీ షానర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లోని న్యూరాలజీ విభాగం హెచ్‌ఓడీ సునీల్ సింగ్లా చెప్పారు. చాలా సందర్భాలలో మెదడుపై వేడి తరంగాలు ప్రభావం చూపించడంతో మరణానికి కారణమవుతుంది.

మెదడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుందని డాక్టర్ సునీల్ వివరించారు. దీని కోసం శరీరంలో థర్మో గ్రాహకాలు ఉన్నాయి. అయితే ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ థర్మో గ్రాహకాలు తమ పనితీరును తగ్గిస్తాయి. ఈ కారణంగా మెదడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోతుంది. పని తీరు దెబ్బతింటుంది. ఇది మరణానికి దారితీయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగినప్పుడు మెదడు చుట్టూ ఉండే రక్షణ పొర దెబ్బతినడం మొదలవుతుందని ఢిల్లీలోని న్యూరోసర్జన్ డాక్టర్ మనీష్ కుమార్ చెబుతున్నారు. అప్పుడు మెదడులో మరింత ప్రోటీన్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మెదడు కణాలు చనిపోతాయి. అప్పుడు ప్రాణాంతకం కావచ్చని చెప్పారు. చాలా సందర్భాలలో తీవ్రమైన వేడి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది. తీవ్రమైన వేడి నుంచి సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకోవడం.. ఈ ఆకస్మిక మార్పు కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ ఏర్పడుతుంది. ఈ సీజన్‌లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. వేడి కారణంగా మరణానికి ఇది కూడా ప్రధాన కారణం.

శీతలీకరణ వ్యవస్థ తీవ్రమైన వేడిలో విస్తరిస్తుంది

నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ శరీరానికి దీని సొంత శీతలీకరణ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎవరైనా ఎండలో ఉన్నప్పుడు.. అతని శరీర ఉష్ణోగ్రత కూడా పెరగడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో.. మెదడు ఉష్ణోగ్రతను నియంత్రించడంలో బిజీగా ఉంటుంది. మెదడు శరీరానికి ఆదేశాలను ఇస్తుంది. శరీరం చెమట పట్టడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా శరీరం స్వయంగా చల్లబడుతుంది. అయితే బయట చాలా వేడిగా ఉన్నప్పుడు.. శీతలీకరణ వ్యవస్థ విఫలమవుతుంది. శరీరం విపరీతంగా చెమట పడుతుంది. అప్పుడు సోడియం లోపం ఏర్పడుతుంది. దీని ప్రభావం మొదట చర్మంపై పడి ఆ తర్వాత అకస్మాత్తుగా మెదడు దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా సంభవిస్తుంది. ఇది మరణానికి కారణమవుతుంది.

ఎలా రక్షించుకోవాలంటే

  1. ఎండలో బయటకు వెళ్లవద్దు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య
  2. ప్రతి గంటకు నీరు త్రాగుతూ ఉండండి. రోజుకు కనీసం 5 లీటర్ల నీరు త్రాగాలి
  3. బయట తయారయ్యే జంక్ ఫుడ్ తినకూడదు
  4. నిమ్మరసం, మజ్జిగ కూడా తాగుతూ ఉండాలి
  5. ఎండలో వెళ్లే సమయంలో తలకు రక్షణగా దుస్తులు లేదా గొడుగు తీసుకుని వెళ్లాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..