Coriander for Weight Loss: ధనియాలను ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ గ్యారెంటీ..
ఈ మధ్య కాలంలో అధిక బరువుతో బాధ పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఆహారపు అలవాట్లు మారడం, లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల బరువు అనేది పెరుగుతున్నారు. బరువు పెరగడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బరువు పెరగడం వల్ల ముందు షుగర్ వ్యాధి, బీపీలు వచ్చేస్తున్నాయి. ఇవి వచ్చాయంటే వీటిని తగ్గించుకోవడానికి జీవితాంతం కష్ట పడుతూ ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తే..

ఈ మధ్య కాలంలో అధిక బరువుతో బాధ పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఆహారపు అలవాట్లు మారడం, లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల బరువు అనేది పెరుగుతున్నారు. బరువు పెరగడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బరువు పెరగడం వల్ల ముందు షుగర్ వ్యాధి, బీపీలు వచ్చేస్తున్నాయి. ఇవి వచ్చాయంటే వీటిని తగ్గించుకోవడానికి జీవితాంతం కష్ట పడుతూ ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తే.. వెంటనే మీ డైట్‌లో చేంజ్ చేయండి. వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు వెయిట్ లాస్ అవుతారు. మీరు బరువు తగ్గేందుకు ధనియాలు కూడా ఎంతో చక్కగా ఉపయోగ పడతాయి. ఎందుకంటే ధనియాల్లో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తూ బరువును తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు ధనియాలను ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.
ధనియాల టీ:
ధనియాలతో తయారు చేసిన టీని హెర్బల్ డ్రింక్ అని కూడా చెప్తారు. ఈ టీ తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్లు వేయాలి. ఇవి మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాలను వేయండి. చిన్న మంట మీద ఉంచి ఇప్పుడు రంగు మారి, నీళ్లు సగం మరిగాక ఆఫ్ చేయండి. తాగే వారు నేరుగా తాగవచ్చు. లేదంటే తేనె కలిపి తాగవచ్చు.
ధనియాల హెర్బల్ డ్రింక్:
ఇప్పుడు చెప్పే డ్రింక్ కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ఈ డ్రింక్ రుచిగా కూడా ఉంటుంది. ముందుగా ధనియాలను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే పుదీనా, నిమ్మ రసం, బ్లాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ వేసి కలపండి. ఈ డ్రింక్‌ని కనీసం రెండు గంటల సేపు అయినా నానబెట్టాలి. వ్యాయామం చేసే ముందు లేదా ఆ తర్వాత అయినా ఈ డ్రింక్ తాగవచ్చు. కుదిరితే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇంకా మంచిది. ఈ డ్రింక్ మిమ్మల్ని హెల్దీగా ఉంచడమే కాకుండా బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. శరీరంలోని చెడు కొవ్వును అంతా కరిగిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








